అమెరికాలో ఆఫర్..ఇల్లు ఉద్యోగం అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..

Tue Jan 01 2019 12:51:10 GMT+0530 (IST)

అగ్రరాజ్యం అమెరికా నుంచి మునుపెన్నడూ లేని ఆఫర్ వచ్చింది. వీసాల పేరుతో అనేక షరతులు విధిస్తున్న ఆ దేశంలో ఓ రాష్ట్రం మా ఇలాకాకు విచ్చేయండి.... ఉండటాకి ఇల్లు చేయటానికి ఉద్యోగం..ఖర్చు పెట్టుకునేందుకు భారీగా నగదు అన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామంటు ప్రకటించింది. అదే అమెరికాలోనే వెర్మాంటా రాష్ట్రం. ఎందుకంటారా....అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్ని సౌకర్యాలు ఉన్నా ఆ రాష్ట్రం జనాభా మాత్రం లేరు. అందుకే జనాభా పెంచుకునేందుకు వెర్మంటా రాష్ట్రం ఇన్ని పాట్లు పడతోంది. వింత వింత పథకాలను ప్రవేశపెడుతోంది. చాలా దేశాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటుంటే..వెర్మంటా రాష్ట్రం మాత్రం జనాభాను పెంచుకోవటానికి నానా అగచాట్లు పడుతోంది.అక్కడి జనాభాలో వయస్సు మళ్ళినవారే ఎక్కువ. యువతరం లేకపోవడంతో పదహారు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో జనాభా సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది. వెర్మంటా రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి వెళితే ఉండడానికి ఇల్లు చేయడానికి ఉద్యోగం అన్నీ ఉచితమే. వెర్మాంట్ రాష్ట్రంలోని ఏ ఊరికెళ్ళి స్థిరపడాలనుకున్నా డబ్బులు ఎదురిచ్చి మరీ ఆహ్వానిస్తారు. కాస్తో కూస్తో కాదు..ఏకంగా  ఏడు లక్షలిస్తారు. ఇదంతా కూడా ఆ ఊర్లో జనాభా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.ఇలాంటి ఆసక్తికరమైన ఆఫర్ ప్రవేశపెట్టిన వెర్మాంట్ గురించి వివరాల్లోకి వెళితే.... వెర్మాంట్ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం ఎంతో డెవలప్ అయ్యింది. కానీ ఉద్యోగాల్లో చేరేందుకు యువత లేకపోవటంతో వారిని ఆకర్షించేందుకు ఉద్యోగంతో పాటు పదివేల డాలర్లు క్యాష్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇలా మూడేళ్లపాటు ఏడాదికి పదివేల డాలర్ల చొప్పున ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ వుండే ఓ  ఇంటిని కూడా వారే ఇస్తారు. అంతేకాదు..ఆఫీస్ వెళ్లే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వుండి వర్క్ చేయాలనుకునేవారికి  కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. కోటి మందికి పైగా జీవించేందుకు వెసులుబాటు వున్న వెర్మాంట్ లో  ప్రస్తుత జనాభా కేవలం ఆరు లక్షలకు కొంచెం పైన మాత్రమే వుంది. ఈ జనాభాను కోటి ముప్పై లక్షల వరకు పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే ‘స్టే టూ వీకెండ్స్’ పేరిట అమలు చేస్తున్న క్రమంలో చుట్టు ప్రక్కల పట్టణాల్లోని ప్రజలు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య వీకెండ్స్ లో వెర్మంట్ కు వచ్చి టూరిస్ట్ ల్లా కంపెనీలతో డిస్కషన్స్ చేసుకోవచ్చు.

అయితే ఈ ఆకర్షణీయమైన ఆఫర్ కు పలు షరతులు వర్తిస్తాయి. పట్టణాలలోని  జనాభా పెంచుకునేందుకు వెర్మాంట్ రాష్ట్రం ప్రవేశపెడుతున్న ఈ పథకంలో ఓ మెలిక కూడా ఉందండోయ్! అక్కడ స్థిరపడేందుకు వెళ్ళే వారందరికీ కాదు. ఇలా వచ్చిన మొదటి వందమంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హులట.  అటు తర్వాత ఏడాదికి ఇరవైమంది చొప్పున ఈ పథకానికి ఎంపిక చేసి నిర్ణయించిన నగదును  వెర్మంటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందట.