Begin typing your search above and press return to search.

హీరోయిన్ల న‌గ్న చిత్రాల కేసు ఏమైంది

By:  Tupaki Desk   |   31 Aug 2015 7:28 PM GMT
హీరోయిన్ల న‌గ్న చిత్రాల కేసు ఏమైంది
X
ఏడాది క్రితం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హాలీవుడ్ హీరోయిన్ల న‌గ్న‌చిత్రాల లీకేజీ ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంది. గ‌తేడాది ఆగ‌స్టు 31, 2014న ఆపిల్ ఐ క్లౌడ్ ఖాతాల‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేసి ప‌లువురు హాలీవుడ్ హీరోయిన్ల న‌గ్న‌చిత్రాల‌ను ప‌లు వెబ్‌ సైట్ ల‌లో పోస్ట్ చేశారు. ఇది అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసును టేకోవ‌ర్ చేసిన ఎఫ్‌.బీ.ఐ ఎంతో మంది చిరునామాల‌ను, కంప్యూట‌ర్ల‌ను స్వాధీనం చేసుకుని ప‌రిశీలించినా చిన్న క్లూ కూడా ప‌ట్టుకోలేక‌పోయింది. సోమ‌వారం ఈ సంస్థ ఈ కేసును తాము ఇంకా మూసివేయ‌లేద‌ని..విచారిస్తూనే ఉన్నామ‌ని నిస్స‌హాయ‌త‌తో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఆపిల్ కంపెనీ మాత్రం త‌మ త‌ప్పేంలేద‌ని..చాలా స్ర్టాంగ్ స‌ర్వ‌ర్ల‌ను తాము నిర్వ‌హిస్తున్నామ‌ని..అయితే ఖాతాదారుల బ‌ల‌హీన‌మైన పాస్‌వ‌ర్డ్‌ ల వ‌ల్లే ఈ స‌మాచారం లీక్ అయ్యింద‌ని చెపుతోంది. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఆఫిల్ ఐ క్లౌడ్ రెండంచెల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను నిర్వ‌హిస్తోంది. చాలా సులువుగా..ఇత‌రులు గుర్తించేలా ఉన్న పుట్టిన రోజులు లేదా, ఫోన్ నెంబ‌ర్ల‌ను పాస్‌వ‌ర్డ్‌ లుగా ఇవ్వ‌కూడ‌ద‌ని ఆ సంస్థ చెపుతోంది.

ఇటీవ‌లే కెన‌డాకు చెందిన ఎడ‌ల్డ్ డేటింగ్ వెబ్‌ సైట్ ఆస్లీ మాడిష‌న్‌, మ‌రో వెబ్‌ సైట్ సోని పిక్చ‌ర్స్ సైట్ల‌ను కూడా హ్యాక‌ర్లు హ్యాక్ చేసి ఎంతోమంది బెడ్ రూం సీక్రెట్‌ల‌ను కూడా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. దీంతో పాస్‌వ‌ర్డ్‌ ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆఫిల్ కంపెనీ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. అలాగే ప్ర‌తి ఒక్క‌రు వాడే ఎలక్ర్టానిక్ ప‌రిక‌రాలు కూడా మంచివే వాడాల‌ని సూచిస్తోంది.

ఇక న‌గ్న చిత్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో బాధితుల్లో ఒక‌రైన ప్ర‌ముఖ హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫ‌ర్ లారెన్స్ మాత్రం ఇది క‌ఠిన‌మైన సెక్స్ నేరం కింద‌కు వ‌స్తుంద‌ని, దోషుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తోంది. ఆఫిల్ కంపెనీ చెప్పిన‌ట్టు ప్ర‌తి ఒక్క‌రు పాస్‌వ‌ర్డ్‌ ల విష‌యంలో ఎంత కేర్‌ గా ఉండాలో ఈ ఉదంతం చెపుతోంది.