Begin typing your search above and press return to search.

హిల్లరీ గెలిస్తే అది చంద్రబాబు ఘనతేనా?

By:  Tupaki Desk   |   24 Oct 2016 10:30 PM GMT
హిల్లరీ గెలిస్తే అది చంద్రబాబు ఘనతేనా?
X
ఎవరు లైమ్ లైట్లోకి వచ్చినా వారి పేరును ఫుల్లుగా వాడుకోవడం తెలిసిన నేత చంద్రబాబు. సత్య నాదెళ్ల - సుందర్ పిచాయ్ - పీవీ సింధు - గోపిచంద్ - అబ్దుల్ కలాం - వాజ్‌ పేయ్‌ ఇలా అందరి విజయాలు - పదవుల వెనుకా తానే ఉన్నానని డప్పుకొట్టుకునే చంద్రబాబు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్న హిల్లరీ క్లింటన్ ను కూడా తన గొప్పలకు వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలనూ చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని... చంద్రబాబు పరపతితో హిల్లరీకి ప్రవాసుల ఓట్లు గంపగుత్తగా పడబోతున్నాయని... చంద్రబాబు చేసిన సాయానికి కృతజ్ఞతగా ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా హిల్లరీ ఆయనకు ముందస్తు ఆహ్వానం పంపారని బాబు అనుకూల మీడియాలో కథనాలు వండివార్చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో చంద్రబాబు ఉపన్యాసాల్లో హిల్లరీ విజయానికి ఆయన చేసిన కృషి గురించి కూడా వినడానికి మనమంతా సిద్ధమవ్వాల్సిందే.

అమెరికాలోని సీమాంధ్రులంతా హిల్లరీకే ఓటేసేలా ఇప్పటికే చంద్రబాబు చక్రం తిప్పారని... డెమోక్రాట్‌ లకు ఎన్‌ ఆర్‌ ఐల ద్వారా భారీగా విరాళాలు కూడా చంద్రబాబు ఇప్పించారని తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2017 జనవరి 20న అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారం ఉంటుందని దానికి చంద్రబాబుకు క్లింటన్ కుటుంబం ముందస్తు ఆహ్వానం పంపిందని రాసేశారు. నిజానికి చంద్రబాబుకు క్లింటన్లతో పరిచయాలున్న విషయం కొట్టిపారేయలేనిది. బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకే 2000కే అవిభక్తాంద్రప్రదేశ్‌ ను సందర్శించారు. అప్పుడు ఆయన వెంట వచ్చిన సతీమణి హిల్లరీతోనూ - కూతురు చెల్సాతోనూ నారా వారి కుటుంబానికి పరిచయం ఉంది. అప్పట్లో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీలంగా వ్యవహరించిన నేపథ్యం కొంత దానికి తోడ్పడింది. అప్పట్లో విద్యార్థిగా ఉన్న లోకేష్‌ చెల్సియాకు హైదరాబాద్ ను చూపించారు. ఆ తర్వాత చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడు కూడా క్లింటన్‌ కు ప్రత్యేక అతిథిగా వైట్‌ హౌస్‌ ను సందర్శించారు. ఇదంతా వాస్తవమే అయినా అమెరికా ఎన్నికలను చంద్రబాబు ఎంతవరకు ప్రభావితం చేయగలరన్నది సిల్లీ క్వశ్చనే. ఏపీలో తాను గెలవడానికే నానా తిప్పలు పడి పవన్ కళ్యాణ్ సాయం తీసుకున్న చంద్రబాబు హిల్లరీకి ఏం సాయం చేయగలరో ఎవరైనా చెప్పగలరు.

అయితే.. ఎలాగూ పెట్టుబడుల కోసం వెళ్ళాల్సి ఉన్నందున హిల్లరీ ప్రమాణస్వీకారానికి హాజరై అభినందనలు చెప్పడం ద్వారా హిల్లరీ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని మరింత పెంచుకోవచ్చని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అది తన పబ్లిసిటీకి వాడుకోవాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అయితే.... ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. వికీలీక్సు విడుదల చేసిన హిల్లరీ వివాదాస్పద ఈమెయిల్సులోనూ చంద్రబాబు - లోకేశ్ ల ప్రస్తావన ఉందన్న ఆరోపణల నేపథ్యంలో హిల్లరీ విజయంలో చంద్రబాబు పాత్ర ఎంతుందో ఏమో కానీ ఏదైనా కుంభకోణాలు బయటపడితే అందులో తమ నేతల పేర్లు బయటకు రాకుంటే చాలంటున్నారట కొందరు టీడీపీ సీనియర్లు.
...

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/