Begin typing your search above and press return to search.

కోడికత్తి కేసు.. కేంద్రం పితలాటకం..

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:34 AM GMT
కోడికత్తి కేసు.. కేంద్రం పితలాటకం..
X
జగన్ పై హత్యాయత్నం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ప్రతిపక్ష నాయకుడిని అంతమొందించే ఈ కుట్ర కేసును జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని.. ఏపీ ప్రభుత్వం కేసును నీరుగారుస్తోందని ఆరోపిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. హైకోర్టులో పీటీషన్ వేసింది. దాంతో కేంద్రంలోని పెద్దలను కలిసి ఒత్తిడి తెచ్చింది.

ఇంత సీరియస్ కేసుపై విచారించిన రాష్ట్ర హైకోర్టు.. ఈ ఘటన విశాఖ ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి.. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు కేసు అప్పగించాలని దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.

కానీ కేంద్రం మాత్రం కోడికత్తి కేసుపై తన స్వార్థం తాను చూసుకుంది. ఏ ఎయిర్ పోర్టులో ఘటన జరిగినా విచారణ చేయాల్సి వస్తుందని.. ఇది తమకు దేశవ్యాప్తంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని గ్రహించి.. హైకోర్టుకు అసలు విషయం చెప్పకుండా.. దీనిపై హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది..

దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. కేంద్రం తమతో పరాచకాలాడుతోందని.. వెంటనే కోడికత్తి కేసు ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందా రాదా తేల్చిచెప్పాలని .. సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం చేస్తున్న ఈ నిర్లక్ష్యాన్ని హైకోర్టు ఎండగట్టింది.