Begin typing your search above and press return to search.

అమెరికా పోలీసులతో హైద‌రాబాద్ అష్ట‌దిగ్భంధ‌నం

By:  Tupaki Desk   |   17 Nov 2017 3:30 PM GMT
అమెరికా పోలీసులతో హైద‌రాబాద్ అష్ట‌దిగ్భంధ‌నం
X
ఏంటి? నిజ‌మా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? నిజ‌మే!! ఏపీ - తెలంగాణ‌ల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌ ను అమెరికా పోలీసులు రేప‌టి నుంచి అష్ట‌దిగ్భంధ‌నం చేయ‌నున్నారు. మెగా సిటీని అణువ‌ణువునూ వారు స్వాధీనం చేసుకోనున్నారు. ప్ర‌తి ఒక్క‌రి క‌ద‌లిక‌ల‌పైనా క‌న్నేయ‌న‌న్నారు. ఇక‌ - మ‌న పోలీసులు అమెరికా పోలీసులు చెప్పిన‌ట్టు న‌డుచుకోనున్నారు. ఎందుకిలా? రాష్ట్రంలో ఏమైంది? అనే సందేహాలు క‌లుగ‌తున్నాయా? విష‌యంలోకి వెళ్తే.. హైద‌రాబాద్‌లో ఈ నెల 28న అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హాజ‌రు కానున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా కేట‌గిరిలో ఉన్న ఇవాంక‌.. హైద‌రాబాద్‌ కు వ‌స్తున్న నేప‌థ్యంలో అక్క‌డి పోలీసులు కూడా హైద‌రాబాద్‌ కు వ‌స్తున్నారు. అంతేకాదు, హైద‌రాబాద్‌ లో భద్రతను వారే ప‌ర్య‌వేక్షిస్తారు. మ‌ఖ్యంగా ఇవాంకా బ‌స చేస్తార‌ని భావిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌ ను సైతం అమెరికా పోలీసులు త‌మ స్వాధీనంలో తీసుకోనున్నారు. ఇక‌, ఫ‌ల‌క్‌ నుమా ప్రాంతంలోని సాధార‌ణ ఇళ్ల‌లో అక్క‌డి వారు త‌ప్ప ఇంకెవ‌రూ ఉండ‌రాదంటూ.. ఇప్ప‌టికే ఆదేశాలు జారీ అయ్యాయి. బంధువులు - స్నేహితులపై నిషేధం విధించారు.

ఇప్పటికే అమెరికా నిఘా వ్యవస్థలు నగర పర్యటనపై పూర్తి వివరాలు సేకరించాయని, మరో రెండు మూడు రోజుల్లో అమెరికా భద్రతా బలగాలు నగరానికి రానున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఇక‌, పారిశ్రామిక వేత్తల సదస్సులో మొదటి రోజు హెచ్ ఐసీసీలో ఇనాగరల్ సెషన్ అయిపోగానే, వివిధ దేశాలనుంచి వచ్చిన 14 వందల మంది డెలిగేట్స్ ఫలక్‌ నూమా ఫ్యాలస్‌ లో డిన్నర్‌ కు వస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతంలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నామ‌ని డీసీపీ చెప్పారు. ఈ ఫ్యాలెస్‌ లో డిన్నర్ మాత్రమే జరుగుతుందని, డెలిగేట్స్ ఎవరూ ఇక్కడ స్టే చేయడం లేదని ఆయన తెలిపారు. పార్క్ హయత్ - తాజ్ డెక్కన్ - గ్రాండ్ కాకతీయతోపాటు స్టార్ హోటల్స్‌లో డెలిగేట్స్ ఉంటారని, ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, అమెరికా అధ్య‌క్షుని కుమార్తె వ‌చ్చి వెళ్లే వ‌ర‌కు న‌గ‌రంలో అమెరికా పోలీసుల ఆంక్ష‌లే అమ‌ల‌వుతాయ‌ని వెల్ల‌డించారు. వారికి తాము పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. సో.. ఇదీ.. విష‌యం!!