Begin typing your search above and press return to search.

తెలంగాణ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్‌

By:  Tupaki Desk   |   16 Sep 2019 2:30 PM GMT
తెలంగాణ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్‌
X
తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. వాటి పై కోర్టుల‌కు పోవ‌డం.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకం గా హైకోర్టు తీర్పులివ్వ‌డం ఇది స‌ర్వ‌సాధార‌ణం అయింది. తెలంగాణ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఇప్ప‌టికే అనేక కేసుల్లో హైకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఇప్పుడు తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టు లో చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌ లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాల పై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పు వెలువరించింది.

తెలంగాణ స‌ర్కారు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌ లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేత పై నిజాం వారసులు - ప్రజా సంఘాలు - సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు.

అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు ? సమంజసమని పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది. ఎర్రమంజిల్‌లోని 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాల‌ని సంక‌ల్పించింది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి, ఉగాది లోపు పూర్తి చేయాల‌ని అనుకుంది. కానీ దీనికి హైకోర్టు చెక్ పెట్టింది.

పురాత‌న భ‌వ‌నాలు కూల్చివేసి అసెంబ్లీ నిర్మించాల‌నుకోవ‌డం ఏంట‌ని హైకోర్టు తెలంగాణ స‌ర్కారును నిల‌దీసింది. దీంతో హైకోర్టు తీర్పుతో తెలంగాణ స‌ర్కారు ఎలాంటి ? నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఏదేమైనా తెలంగాణ స‌ర్కార్‌కు హైకోర్టులో వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక‌పై అయినా సీఎం కేసీఆర్ కీల‌క అంశాల విష‌యంలో ఆచితూచి ముందుకు వెళ‌తారేమో ? చూడాలి.