Begin typing your search above and press return to search.

హైకోర్టులో కేసీఆర్ మాటే నెగ్గింది

By:  Tupaki Desk   |   29 April 2016 12:16 PM GMT
హైకోర్టులో కేసీఆర్ మాటే నెగ్గింది
X
తొలిసారిగా రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తెలంగాణ ప్ర‌భుత్వానికి తీపి క‌బురు అందించింది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురైంది. బోగస్ కాలేజీల ఏరివేత కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన తనిఖీలపై ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల తనిఖీలకోసం పోలీసుల సహాయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

ప్రభుత్వ వాదనలపై హైకోర్టు ఏఖీభవిస్తూ ఒక ఎస్సై - ఇద్దరు కానిస్టేబుళ్ల సహాయంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయొచ్చని తెలిపింది. పోలీసులతో తనిఖీలు చేయడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ద్విసభ్య బెంచ్ కు అప్పీల్ చేసుకుంది. అడిషనల్ ఏజీ రామచందర్‌ రావు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు ప్రతీ ప్రైవేటు విద్యాసంస్థపై సోదా నిర్వహించే నిర్వహించి బోగస్ కాలేజీలను గుర్తించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఎస్‌ ఐ - ఇద్దరు కానిస్టేబుళ్లతో విజిలెన్స్ సోదాలు చేసుకోవడానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హించాల్సిన ఎంసెట్‌ - టెట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఈ త‌నిఖీలు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. త‌ద్వారా త‌న‌కు స‌వాల్‌ గా నిలిచిన ప్రైవేటు కాలేజీల‌కు ముకుతాడు వేసేందుకు అడుగులు వేయ‌నున్నార‌ని భావిస్తున్నారు.