Begin typing your search above and press return to search.

బాబుకు హైకోర్టు మొట్టికాయలు

By:  Tupaki Desk   |   15 Aug 2018 8:04 AM GMT
బాబుకు హైకోర్టు మొట్టికాయలు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ఉమ్మడి హైకోర్టు మొట్టికాయలు వేసింది. తాను ఏంచేసినా అదే చట్టమనుకునే చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉన్నా అవేవీ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పథాకాలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కూతురిని - అధికారాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వ పథాకాలకు అత్తగారి పేరు పెట్టాడంపై ప్రజలే కాదు హైకోర్టూ తప్పుపడుతోంది. స్వాతంత్రదినోత్సావ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అత్తగారి పేరిట పెట్టిన పధాకానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ప్రతీ అంశంలోను హైకోర్టు నుంచి - ప్రజల నుంచి వ్యతీరేకత ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు ఈ కొత్త పథకంలో కూడా హైకోర్టు నుంచి చీవాట్లు తిన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రవేశ పెట్టిన పథాకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించి ఓట్లు కొల్లగొట్టాలనుకున్న చంద్రబాబుకు చుక్కెదురైంది. గర్భిణులకు సాయంచేసే ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రకటించరాదంటూ వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌ లో గర్భిణులకు వర్తించే ఈ పథకంలో అవకతవకలున్నాయని ప్రజాప్రయోజిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిత్వ శాఖపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఆయనే నిర్వహిస్తున్న ఈ శాఖలో ఇంతకుముందే పలు ఆరోపణలున్నాయి. కొత్తగా చేపడుతున్నా ఈ పథకంలో కూడా అవకతవకలు జరుగుతాయని హైకోర్టులో పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో ఈ పథకాన్ని తాత్కలకంగా నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశించింది. పథకం నిలిపివేతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడి ఎన్నికల పాచిక పారడంలేదు.