Begin typing your search above and press return to search.

హైకోర్టులో డార్లింగ్ కు భారీ ఊర‌ట‌

By:  Tupaki Desk   |   24 April 2019 4:38 AM GMT
హైకోర్టులో డార్లింగ్ కు భారీ ఊర‌ట‌
X
డార్లింగ్ కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆ మ‌ధ్య‌న ప్ర‌ముఖ సినీ న‌టుడు ప్ర‌భాస్ కు చెందిన భూమిని ఖాళీ చేయించిన తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీరు స‌రికాద‌ని తేల్చింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. అంతేకాదు.. ఆరు ద‌శాబ్దాలుగా న‌లుగుతున్న వంద‌ల ఎక‌రాల భూవివాదానికి తాజాగా పుల్ స్టాప్ పెట్టేసిన హైకోర్టు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని జారీ చేసింది. ఆ భూమి నుంచి ప్ర‌భాస్ ను ఖాళీ చేయ‌టం త‌ప్ప‌ని తేల్చింది. తాజాగా చేసిన అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

రంగారెడ్డి జిల్లా రాయ్ దుర్గ ప‌న్మ‌క్త గ్రామంలో కొన్ని వంద‌ల ఎక‌రాల‌కు సంబంధించిన‌ భూ యాజ‌మాన్య హ‌క్కు మీద వివాదం న‌డుస్తోంది. దీనిపై హైకోర్టు తాజాగా స్ప‌ష్ట‌త ఇవ్వ‌టం ఒక ఎత్తు కాగా.. ప్ర‌భుత్వం ఏం చేయొచ్చు.. ఏం చేయ‌కూడ‌ద‌న్న అంశాల మీదా క్లారిటీ ఇచ్చేసింది.

ప్ర‌భాస్ కొనుగోలు చేసిన భూమికి అస‌లు య‌జ‌మానిని తానేనంటూ ప్ర‌భుత్వం ఆ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిపై న్యాయ‌పోరాటం చేస్తున్నారు డార్లింగ్ ప్ర‌భాస్.ఈ పిటిష‌న్ తో పాటు.. ఇదే త‌ర‌హాలో వివాదం ఉన్న అంశాల‌పైనా న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం స్ప‌స్ట‌త‌నిస్తూ.. ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని ప‌న్మ‌క్త గ్రామంలో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు ప్ర‌భాస్. అయితే.. ఆ భూమికి సంబంధించిన అస‌లు య‌జ‌మానిని తానేన‌ని తెలంగాణ ప్ర‌భుత్వం వాదిస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ కొనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకుంది తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్. అంతేకాదు.. భూమిలో నుంచి ప్ర‌భాస్ ను ఖాళీ చేయించి..తాళాలు వేసింది. ఈ అంశంపై త‌న‌కు న్యాయం చేయాలంటూ ప్ర‌భాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేట్టిన జ‌స్టిస్ వి. రామ సుబ్ర‌మ‌ణియ‌న్.. జ‌స్టిస్ పి.కేశ‌వ‌రావులతో కూడిన ధ‌ర్మాస‌నం తాజాగా తీర్పునిచ్చారు.

హైకోర్టు పేర్కొన్న కీల‌కాంశాలు ఇవే!

+ 1958 నుంచి ఇక్కడి భూములపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించలేం. అదే స‌మ‌యంలో భూ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అప్లికేష‌న్ పెట్టుకుంటే విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు.. ప్ర‌భుత్వం ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఆ ద‌ర‌ఖాస్తును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

+ తీర్పు కాపీ అందిన 8 వారాల వ్య‌వ‌ధిలో దర‌ఖాస్తుపై త‌గిన ఉత్త‌ర్వుల్ని ప్ర‌భుత్వం జారీ చేయాలి. ఈ ప‌ని చేస్తే ఏళ్ల నుంచి ఉన్న సుదీర్ఘ భూవివాదాల్ని ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించిన‌ట్లు అవుతుంది.

+ ప్ర‌భాస్ మాదిరి భూమిపై యాజ‌మాన్య హ‌క్కుల కోరుతున్న వారు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంది. ప్ర‌భాస్ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును ఆమోదిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేస్తే.. ఆ భూమి అత‌ని స్వాధీన‌మ‌వుతుంది.

+ ఒక‌వేళ అప్పుడు కూడా ప్ర‌భుత్వం ప్ర‌భాస్ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తే.. అత‌ను కోర్టును ఆశ్ర‌యించొచ్చు.

+ భూమి ఎవ‌రి మీద ఉందో వారు రిజిస్ట‌ర్ సేల్ డీడ్ల ద్వారా ఆ భూముల‌పై సంక్ర‌మించిన హ‌క్కుల్ని వ‌దులుకోవాలి. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ఫీజు చెల్లిస్తే.. .. అప్పుడు ఆ భూముల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాలి. అలా చేస్తే ప్ర‌భుత్వానికి వేలాది కోట్ల రూపాయిల ఆదాయం స‌మ‌కూరుతుంది.