Begin typing your search above and press return to search.

కోళ్ల‌కు ఇచ్చిన‌ట్లు ఆడోళ్ల‌కు ఆ ఇంజెక్ష‌న్లు ఇస్తారా?

By:  Tupaki Desk   |   23 Oct 2018 9:24 AM GMT
కోళ్ల‌కు ఇచ్చిన‌ట్లు ఆడోళ్ల‌కు ఆ ఇంజెక్ష‌న్లు ఇస్తారా?
X
ఉమ్మ‌డి హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. నిఘా వ్య‌వ‌స్థ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ.. యాదాద్రిలో బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేసే దారుణం మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మాంసం పెర‌గ‌టానికి బాయిల‌ర్ కోళ్ల‌కు ఇంజ‌క్ష‌న్లు ఇస్తున్న‌ట్లుగా.. చిన్నారుల శ‌రీరాలు పెరిగేలా హార్మోన్ ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి వ్య‌భిచార కూపంలో దించ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇంత దారుణం జ‌రుగుతుంటే.. నిఘా విభాగం ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నించింది. హార్మోన్ ఇంజెక్ష‌న్లు ఇస్తున్న వారిపై ఐసీపీ సెక్ష‌న్ 120(బి) కింద కేసులు న‌మోదు చేశారా? అని ప్ర‌శ్నించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం.. అధికారుల‌కు తెలీకుండా ఇది జ‌రిగి ఉంటుందా? అని ప్ర‌శ్నించింది.

అధికారుల‌కు.. నిఘా వ‌ర్గాల‌కు తెలీకుండా జ‌రిగి ఉంటుంద‌ని తాము భావించ‌టం లేద‌ని.. నిర్వాహ‌కుల‌తో సంబంధిత అధికారులు లాలూచీ ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. అంతేకాదు.. ఈ కేసుల‌కు సంబంధించిన నిందితుల‌కు కింది కోర్టులు బెయిల్ ఎలా ఇస్తాయ‌న్న ప్ర‌శ్న‌ను సందించింది. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే పోలీసు శాఖ కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అద‌న‌పు ఏజీ జె. రామ‌చందర్ రావు కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. దీనిపై ధ‌ర్మాస‌నం అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

సీరియ‌స్ గా తీసుకోవాల్సిన కేసుల్లో బాధిత చిన్నారుల‌కు ప‌రిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే స‌రిపోద‌ని.. చిన్నారుల ర‌క్ష‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకోవ‌టంతో పాటు.. బాధ్యుల‌పై క‌ఠినచ‌ర్య‌లు తీసుకోవాలంది. పోలీసు శాఖ‌.. నిఘా విభాగం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసిన తీరు నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో మ‌రెన్ని ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.