Begin typing your search above and press return to search.

200కోట్ల ఆస్తిని 2500 కోట్లుగా చెప్పారా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:10 AM GMT
200కోట్ల ఆస్తిని 2500 కోట్లుగా చెప్పారా?
X
లక్షలాది మందికి కంటికి కునుకు లేకుండా చేసిన అగ్రిగోల్డ్ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఈ రోజు హైకోర్టు వెలువరించనుందని చెబుతున్నారు. అయితే.. మంగళవారం ఉదయం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్న సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు సీరియస్ అయ్యారు.

అగ్రిగోల్డ్ న్యాయమూర్తులు సంస్థకున్న ఆస్తుల వివరాలు చెబుతూ.. వాటి విలువల్ని భారీగా ఛెప్పటం.. దీనికి స్పందించిన కోర్టు.. అంత మొత్తం ఉండదన్న వ్యాఖ్యతో పాటు.. తక్కువ విలువ ఉన్న ఆస్తిని.. ఎక్కువగా చూపిస్తూ కోర్టును తప్పుదారి పట్టిస్తారా? అని మండిపడింది. విచారణలో భాగంగా అగ్రిగోల్డ్ కు చెందిన ఛైర్మన్.. నలుగురు డైరెక్టర్లు హాజరయ్యారు. ఇక సంస్థ ఆస్తుల విషయంపై న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. బెంగళూరులోని 172 ఎకరాలకు రూ.1500కోట్లు.. విజయవాడలోని 170 ఎకరాలకు రూ.1000కోట్లు వస్తాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందిస్తూ.. ఆస్తుల విలువను ఎక్కువగా చేసి చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారంటూ అగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ.. బెంగళూరు ఆస్తులు అమ్మితే రూ.200కోట్లకు మించి రావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టును తప్పు దారి పట్టిస్తే.. సహించేది లేదంటూ మండి పడింది. ఇక.. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని విక్రయించి.. బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించటంతో పాటు.. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని సూచించింది.