Begin typing your search above and press return to search.

జ‌న‌సేన పార్టీ ఎంపీ అభ్య‌ర్థి ఆ హీరోన‌ట‌!!

By:  Tupaki Desk   |   26 Jun 2017 6:53 AM GMT
జ‌న‌సేన పార్టీ ఎంపీ అభ్య‌ర్థి ఆ హీరోన‌ట‌!!
X
2019 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతాం...జన‌సేన త‌ర‌ఫున స‌త్తా చాటుతాం అని ప‌వ‌ర్ స్టార్ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేతలుగా కొంద‌రు ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రోవైపు పార్టీ సైతం వివిధ ప్రాంతాల్లో కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ ప‌డే అభ్య‌ర్థుల పేర్లు అప్పుడే ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా గుంటూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ముఖ సినీ హీరో శివాజీ పేరు వినిపిస్తోంది.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ-జ‌న‌సేన కూటమికి మ‌ద్ద‌తిచ్చిన శివాజీ అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ - టీడీపీలు ప్ర‌త్యేక హోదాపై చేతులు ఎత్తేయ‌డంతో ఆ రెండు పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకొని శివాజి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్రుల ఆకాంక్ష‌లు తుంగ‌లో తొక్కార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాటం చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి శివాజీ ద‌గ్గ‌ర అవుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే బీజేపీ నుంచి శివాజీ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ప‌లు కార‌ణాల వ‌ల్ల వెన‌క్కుపోయింది. కానీ ఈ ద‌పా శివాజీ పోటీ చేస్తార‌ని, అందుకు జ‌న‌సేన వేదిక కానుంద‌ని అంటున్నారు. వివిధ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం ప్ర‌కారం గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/