Begin typing your search above and press return to search.

కొత్త నినాదం: బీజేపీ హఠావో.. ఏపీ బచావో

By:  Tupaki Desk   |   23 May 2016 9:56 AM GMT
కొత్త నినాదం: బీజేపీ హఠావో.. ఏపీ బచావో
X
‘‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’’.. రెండేళ్ల కిందట జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి తెచ్చిన నినాదమిది. దాని స్ఫూర్తితో ఇప్పుడు కొత్త నినాదాన్ని తీసుకొచ్చాడు మరో టాలీవుడ్ హీరో శివాజీ. కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అలుపెరగని పోరాటం చేస్తున్న శివాజీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ.. ‘బీజేపీ హఠావో.. ఏపీ బచావో’ అనే నినాదాన్నిచ్చాడు. గత ఎన్నికల సందర్భంగా శివాజీ భాజపా తీర్థం పుచ్చుకోవడం.. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయడం తెలిసిందే.

ఐతే ఎన్నికల అనంతరం మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయకుండా వదిలేయడంతో శివాజీ పోరాటం మొదలుపెట్టాడు. ప్రత్యేక హోదా కోరుతూ దీక్షలు చేశాడు.. ఆందోళనల్లో పాల్గొన్నాడు. తాజాగా భాజపా మీద ఉద్యమానికి సిద్ధమైపోయాడు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పెట్టినపుడు ఇచ్చిన హామీలన్నింటినీ భాజపా తుంగలోకి తొక్కిందని అతను ఆరోపించాడు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన భాజపా నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఏపీని అడుక్కునే రాష్ట్రంగా మార్చారని.. వారి భార్యలు వారికి ఇంట్లో భోజనం కూడా పెట్టకూడదని శివాజీ అన్నాడు. కేంద్ర మంత్రులు.. భాజపా నాయకులు రాష్ట్రానికి వచ్చినపుడు వారిని అడ్డుకుని నిలదీయాలని శివాజీ పిలుపునిచ్చాడు. ప్రత్యేక హోదా కోసం మున్ముందు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నట్లు శివాజీ ప్రకటించాడు.