Begin typing your search above and press return to search.

`హెరిటేజ్` ఫ్రీజ‌ర్ లో వ‌న్య‌ప్రాణుల మాంసం!

By:  Tupaki Desk   |   3 July 2018 8:32 PM IST
`హెరిటేజ్` ఫ్రీజ‌ర్ లో వ‌న్య‌ప్రాణుల మాంసం!
X
2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అవినీతి తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు హ‌యాంలో భూక‌బ్జాలు..భూ ఆక్ర‌మ‌ణ‌లు...ఇసుక దందా...విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. య‌థా రాజ‌...త‌థా ప్ర‌జ అన్న రీతిలో ....చంద్ర‌బాబు స‌ర్కార్ లోని మంత్రులు - ఎమ్మెల్యేలు - నేత‌లు రెచ్చిపోయి అవినీతికి పాల్ప‌డ‌డంపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు.....చివ‌రికి వ‌న్య ప్రాణుల‌ను కూడా వ‌ద‌ల‌ని వైనం ప‌లువురిని విస్మయానికి గురిచేస్తోంది. వ‌న్య‌ప్రాణుల మాంసంతో వెలుగుచూసిన ఘ‌ట‌న ద్వారా తేట తెల్ల‌మైంది. విశాఖ‌ప‌ట్నంలోని పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో సుమారు 70 కిలోల వన్యప్రాణుల మాంసం ప‌ట్టుబ‌డడం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.` హెరిటేజ్‌` కు చెందిన ఫ్రీజర్‌ బాక్సులో ఆ మాంసాన్ని త‌ర‌లిస్తుండ‌గా అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడికి స‌న్నిహితుడైన టీడీపీ నేత కృష్ణంరాజు నిర్వ‌హిస్తోన్న ఫంక్ష‌న్ కోసం ఆ మాంసాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు నిందితులు తెలిపారు.

మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన కృష్ణంరాజు ఈ త‌ర‌హా వ‌న్య ప్రాణి మాంసం విందులివ్వ‌డంలో సిద్ధ‌హ‌స్తుడ‌ని తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని గెస్ట్‌ హౌస్ లో మంత్రులు - ఎమ్మెల్యేలు - రాజ‌కీయనేత‌లు - సినీ ప్రముఖులలకు వన్యప్రాణుల మాంసంతో విందు ఇవ్వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇదే త‌ర‌హాలో చక్కెర కర్మాగారం వెనుక కూత వేటు దూరంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో ఆదివారం నాడు కృష్ణంరాజు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వ‌డానికి ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే కృష్ణం రాజుకు చెందిన స్కార్పియోలో ఆ మాంసాన్ని త‌ర‌లిస్తుండ‌గా అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకున్నారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా `హెరిటేజ్‌` ఫ్రీజర్‌ బాక్సులో ఆ మాంసం బ‌స్తాల‌ను తరలించడం విశేషం. అయితే, టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలోనే అట‌వీ అధికారుల‌కు ఓ వర్గం నేతలు స‌మాచార‌మిచ్చార‌ని తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట జరుగుతున్నా కూడా...ప‌ట్టించుకోని అధికారులు...ఇపుడు స్పందించ‌డానికి కూడా ఆ ఫిర్యాదే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే, టీడీపీ నేతల ఒత్తిళ్ల వ‌ల్లే .... ఆ ప్రాంత డీఎఫ్ వో స్పందించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ చుక్కల రవిప్రసాద్‌ చెప్పారు.