Begin typing your search above and press return to search.

బాబు ఇంటి కంపెనీకి అవార్డులే అవార్డులు

By:  Tupaki Desk   |   19 Nov 2017 5:35 AM GMT
బాబు ఇంటి కంపెనీకి అవార్డులే అవార్డులు
X
ఆ కంపెనీ పేరు చెప్పినంత‌నే ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫ్యామిలీ గుర్తుకు వ‌స్తుంది. ఇంత చెప్పిన త‌ర్వాత కూడా కంపెనీ పేరు చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దేమో. అయినా స‌రే.. ప‌ద్ధ‌తి ప్ర‌కారం కంపెనీ పేరు చెప్పేస్తాం. అవును.. హెరిటేజ్ ఫుడ్స్‌.

చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. ఆయ‌న కోడ‌లు క‌లిసి నిర్వ‌హించే హెరిటేజ్ ఫుడ్స్‌కు తాజాగా మూడు అవార్డులు వ‌చ్చాయి. ఒకే స‌మ‌యంలో వేర్వేరు వేదిక‌ల‌కు సంబంధించి వ‌చ్చిన మూడు అవార్డులు రావ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బాబు ఇంటి సంస్థ‌ల‌కు వ‌చ్చిన అవార్డుల్ని చూస్తే.. ఒక‌టి వ‌ర‌ల్డ్ సీఎస్ ఆర్ డే అండ్ వ‌ర‌ల్డ్ స‌స్టెయిన‌బిలిటీ నుంచి తెలంగాణ బెస్ట్ ఎంప్లాయ‌ర్ బ్రాండ్ అవార్డు 2017 వ‌చ్చిన‌ట్లుగా హెరిటేజ్ ఫుడ్స్ వెల్ల‌డించింది.

అదే విధంగా సంస్థ‌కు చెందిన ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ వో) ఎ ప్ర‌భాక‌ర్ రావు హైద‌రాబాద్ సీఎఫ్ వో లీడ‌ర్ షిప్ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇక‌.. మూడో అవార్డు విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీలో జ‌రిగిన గ్రేట్ ఇండియా ఐస్ క్రీం అండ్ ఫ్రోజెన్ డెజ‌ర్ట్ కంటెస్ట్ లో 2017లోనూ హెరిటేజ్ ఫుడ్స్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు ల‌భించిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. మొత్తానికి బాబు గారి ఇంటి కంపెనీకి భారీ గుర్తింపే ద‌క్కుతోంది. ఈ క్రెడిట్ అంతా బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి.. బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణిల‌కే చెందుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.