Begin typing your search above and press return to search.

నిన్న ఐపీఎల్ మ్యాచ్ లేక‌పోవ‌టం ఎంత అదృష్ట‌మంటే?

By:  Tupaki Desk   |   23 April 2019 5:07 AM GMT
నిన్న ఐపీఎల్ మ్యాచ్ లేక‌పోవ‌టం ఎంత అదృష్ట‌మంటే?
X
విన్నంత‌నే వ‌ణుకు పుట్టే విష‌యంగా దీన్ని చెప్పాలి. నిజంగానే హైద‌రాబాదీయులు చాలా అదృష్ట‌వంతులు. నిన్న (సోమ‌వారం) రాత్రి హైద‌రాబాద్ లో కురిసిన భారీ వ‌ర్షం.. పెనుగాలుల ధాటికి ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. భారీ సంఖ్య‌లో చెట్లు విరిగిప‌డ్డాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. న‌గ‌రంలోని మూడు ప్రాంతాల్లో ఉన్న స్టేడియంలో పెనుగాలుల ప్ర‌భావానికి లోన‌య్యాయి.

ఎల్బీ స్టేడియంలో ఫ్ల‌డ్ లైట్ల ట‌వ‌ర్ కూలిపోగా.. ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ షెడ్లకు ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ఎవ‌రికి గాయాలు కాలేదు. ఇక‌.. న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియం కూడా భారీగా డ్యామేజ్ అయ్యింది. రాత్రి కురిసిన వ‌ర్షం.. భారీ గాలుల‌కు ఉప్ప‌ల్ స్టేడియంలోని సౌత్ పెవీలియ‌న్ 80 శాతం మేర దెబ్బ తిన్న‌ట్లు చెబుతున్నారు.

సోమ‌వారం కానీ ఐపీఎల్ మ్యాచ్ ఉన్న‌ట్లైయితే.. ఊహించ‌నంత భారీగా విషాదం చోటు చేసుకునేద‌ని చెబుతున్నారు. ఆదివారం రాత్రి మ్యాచ్ జ‌రిగింది. షెడ్యూల్ లో భాగంగా సోమవారం మ్యాచ్ లేక‌పోవ‌టం హైద‌రాబాదీయులు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింద‌ని చెప్పాలి.

ఒక‌వేళ‌.. సోమ‌వారం రాత్రి కానీ ఐపీఎల్ మ్యాచ్ జ‌రిగితే అన్న ఊహ కూడా వ‌ణుకు పుట్టించే ప‌రిస్థితి. ఉప్ప‌ల్లో సోమ‌వారం రాత్రి వీచిన పెనుగాలుల కార‌ణంగా ఉప్ప‌ల్ స్టేడియంకు ఓమోస్త‌రు డ్యామేజ్ జ‌రిగింది. పెనుగాలుల‌కు షెడ్డు.. ఓ ఎల్ ఈడీ కుప్ప‌కూలాయి. జ‌నాలు ఎవ‌రూ లేని వేళ‌లో వీచిన గాలుల‌తో ఆస్తి న‌ష్టం జ‌రిగిందే త‌ప్పించి. .ఎవ‌రికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేదు. ఇదంతా చూశాక‌.. సోమ‌వారం రాత్రి కానీ ఐపీఎల్ మ్యాచ్ ఉండి ఉంటే..? ఆలోచ‌న కూడా భ‌యం క‌లిగేలా లేదు?