Begin typing your search above and press return to search.

లంక గ్రామాలను తలపించిన బెంగళూరు!

By:  Tupaki Desk   |   30 July 2016 4:19 AM GMT
లంక గ్రామాలను తలపించిన బెంగళూరు!
X
సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు - హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్లపైకి ఫుల్ గా నీరు వచ్చి చేరితే.. ఇకపై పడవలేసుకుని తిరగాలేమో అని సరదా వ్యాఖ్యలు చేయడం పరిపాటి. ఈ సరదా సంఘటన నిజంగానే జరిగిందని చెప్పుకోవాలి. బెంగళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏ స్థాయిలో అంటే.. ఇది బెంగళూరేనే అనిపించే స్థాయిలో, వరదలకు లంక గ్రామాలు మునిగినట్లు మునిగిపోయింది.
ఏకదాటిగా కురిసినా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతోపాటు, చెరువులు వర్షం నీటితో పూర్తిగా నిండిపోయి - రోడ్లు కాలవలను తలపించాయి.

ఉదయం వరకూ బైక్ లపైనా - కార్లపైనా తిరిగిన రోడ్లపై ఉన్నట్లుండి పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఈ క్రమంలో పూర్తిగా నిండిన చెరుగుల నుంచి చేపలు బయటకు రావడం మొదలుపెట్టాయి. చెరువులు - రోడ్లు సమానమైపోయేటప్పటికి చెరువుల్లోని చేపలు కిలకేసుకుంటూ బయటకు వచ్చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు రోడ్లపైనే చేపలను పట్టడం మొదలుపెట్టారు. మరికొంతమందైతే రోడ్లపైనే వలలు వేసిమరీ చేపలు పట్టారు. ఈ స్థాయిలో భారీ వర్షం కారణంగా బెంగళూరు వాసులు ఇబ్బందిపడ్డారు. చాలా ఐటీ కంపెనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ జామ్ - విద్యుత్ సమస్యలతో బెంగళూరు వాసుల ఇక్కట్లు పడ్డారు!!