Begin typing your search above and press return to search.

బాటిల్ నీళ్లు తాగుతున్నారా... ఒక్క నిమిషం

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:30 PM GMT
బాటిల్ నీళ్లు తాగుతున్నారా... ఒక్క నిమిషం
X
ఇవాల్టి రోజున బాటిల్ నీళ్లు తాగ‌నోళ్లు ఉండ‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. ప్యాకేజ్డ్ వాట‌ర్ ఎంతో సుర‌క్షిత‌మ‌న్న ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఇళ్ల‌ల్లో సైతం.. న‌ల్లా నీళ్ల‌ను వాడ‌టం మానేసి.. 20 లీట‌ర్ల క్యాన్ లో ఇచ్చే నీటిని వాడుతున్నోళ్లే ఎక్కువ‌. ఒక‌ప్పుడు న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాల‌కూ పాకుతోంది. మ‌రి.. బాటిళ్ల‌లో ఉన్న నీటిని వాడ‌టం ఎంత వ‌ర‌కు మేలు అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

వాట‌ర్ బాటిళ్ల‌ను ఒక‌సారి కంటే ఎక్కువ‌సార్లు వినియోగించేవాళ్లు కోట్లాది మంది ఉంటారు. అయితే.. అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌వ‌హారంగా చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల వాట‌ర్‌ ను తాగే అల‌వాటు ఉన్న వారు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్ని ఎదుర్కొనే ప్ర‌మాదం పొంచి ఉంది. ఒక‌సారి ఉప‌యోగించిన బాటిల్‌ ను మ‌ళ్లీ వాడ‌టం ఎంత‌మాత్రం మంచిది కాద‌ని చెబుతున్నారు నిపుణులు. టాయిలెట్ సీట్ మీద ఎన్ని క్రిములు ఉంటాయో.. ప్లాస్టిక్ బాటిళ్ల‌పైనా అంత బ్యాక్టీరియా ఉంటుంద‌ని చేతులు క‌డుక్కోకుండా బాటిళ్ల‌ను వాడ‌టం.. త‌ర‌చూ క్లీన్ చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల బాటిళ్ల మీద బ్యాక్టీరియా పెరుగుతుంద‌ని చెబుతున్నారు.

ఇక‌.. ప్లాస్టిక్ బాటిళ్ల‌కు వేడి త‌గిలితే అందులోని నీళ్లు మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నారు. అన్నింటికి మించి వాట‌ర్ బాటిల్ మూత మీద ఉంటే బ్యాక్టీరియా అన్నిఇన్ని కావ‌ని.. నీళ్ల బాటిల్‌కు వేడి త‌గిలితే ఆక్సిజ‌న్ తో చ‌ర్య జ‌రిగే అవ‌కాశం ఎక్కువ ఉంటుంద‌ని చెబుతున్నారు. అలా జ‌రిగిన‌ప‌క్షంలో ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయ‌ని.. వాటితో ఆరోగ్యం గోవిందా అని చెబుతున్నారు.

ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్ వాడే ముందు దాని మీద ఉన్న గుర్తును త‌ప్ప‌నిస‌రిగా గ‌మ‌నించాల‌ని.. అప్పుడు మాత్ర‌మే వాడాల‌ని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ ఏ మెటీరియ‌ల్ తో త‌యారైంద‌న్న విష‌యాన్ని చెప్పే ఈ గుర్తుతో బాటిల్ నాణ్య‌త‌.. దాన్ని ఎన్నిసార్లు వాడాలో చెప్పేస్తుంది.

+ ట్ర‌యాంగిల్ ఆకారంలో 1 అని ఉంటే.. అది పాలీ ఇథైలీన్ టెరిప్ల్త‌లేట్ తో త‌యారు చేసిన‌ట్లు. దాన్ని ఒక్క‌సారంటే ఒక్క‌సారి మాత్ర‌మే వాడాలి. రెండోసారి వాడ‌టం ఏ మాత్రం మంచిది కాదు.

+ ట్ర‌యాంగిల్ ఆకారంలో 2 లేదంటే 7 అని ఉంటే ఆ బాటిల్‌ ను పాలీవినైల్ క్లోరైడ్ తో త‌యారు చేసిన‌ట్లు. ఇలాంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తే.. అవి విడుద‌ల చేసే ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు మ‌నం తినే ఆహారం.. నీటిలో క‌లిసి పోతాయి.

+ ట్ర‌యాంగిల్ 2 లేదంటే 4 అని ఉంటే అలాంటి బాటిళ్ల‌ను పాలి ఇథైలీన్ తో త‌యారు చేసిన‌ట్లు. ఇవి మ‌ళ్లీ మ‌ళ్లీ వాడేలా ఉంటాయి. అయితే.. ఇలా వాడేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

+ ట్ర‌యాంగిల్ 5 అని ఉంటే వాటిని పాలీ ప్రొపైలీన్ తో త‌యారు చేస్తారు. ఇలాంటివి కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ వాడొచ్చు. ట్రాయాంగిల్ 2 - 4 - 5 ర‌కం బాటిళ్లను ఉప‌యోగించేట‌ప్పుడు త‌ర‌చూ వెనిగ‌ర్‌.. యాంటీ బ్యాక్టీరియ‌ల్ మౌత్ వాష్ ల‌తో త‌ర‌చూ క్లీన్ చేస్తుండాలి. లేకుంటే.. ఆరోగ్యం త‌ర్వాత‌.. అనారోగ్యం మాత్రం ప‌క్కా.