Begin typing your search above and press return to search.

ఆ టీనేజర్ పిల్ల ఉగ్రవాదని కన్ఫర్మ్ చేశారు

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:13 AM GMT
ఆ టీనేజర్ పిల్ల ఉగ్రవాదని కన్ఫర్మ్ చేశారు
X
గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మోడీ టైంలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేయటంతో పాటు.. మోడీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. ఒక ముస్లిం టీనేజర్ (ఇష్రాత్ జహాన్) అమ్మాయిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై దరిద్రపుగొట్టు రాజకీయాలు చాలానే జరిగిపోయాయి. అయితే.. ఎన్ కౌంటర్ అయిన సదరు అమ్మాయి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని పోలీసు వర్గాలు మొత్తుకున్నా.. మతం రంగు అద్దారే తప్పించి వాస్తవాల్లోకి వెళ్లింది లేదు.

అయితే.. అందరూ అనుకుంటున్నట్లు ఇష్రాత్ అమాయకురాలేమీ కాదని.. పెద్ద మాయలేడి అని తేలిపోయింది. పాకిస్థానీ.. అమెరికన్ అయిన రిచర్డ్ హాడ్లీ తాజాగా ఆ విషయాల్ని వెల్లడించాడు. ముంబయి దాడుల కేసులకు సంబంధించి 35 ఏళ్లు జైలుశిక్ష అనుభవిస్తున్న హాడ్లీ ఇష్రాత్ కు సంబంధించి వివరాల్ని తాజాగా ముంబయి ప్రత్యేక కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

హాడ్లీ ఇచ్చిన వాంగూల్మం చూస్తే..

= లష్కరే తోయిబాలో ఒక మహిళా విభాగం ఉంది. దానికి అబూ అయ్ మన్ అనే వ్యక్తి తల్లి నడుపుతుంటుంది.

= భారత్ లో ఎక్కడ జరిగిందో తెలీదుకానీ.. ఒక గందరగోళ ఆపరేషన్ లో ఒక మహిళా ఉగ్రవాది మరణించినట్లు నాకు చెప్పారు.

= ఆమె పాకిస్థానీయురాలు కాదు. భారతీయురాలే. లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తి.

= సదరు మహిళ పేరు ఏమిటన్న ప్రశ్నకు హాడ్లీ సమాధానం చెప్పలేదు.

= దీంతో.. హాడ్లీకి ఇష్రాత్ జహాన్ తో పాటు.. మరో ఇద్దరి పేర్లు సూచించగా.. ఇష్రాత్ జహాన్ పేరును చెబితే.. ఇష్రాత్ జహాన్ లష్కరేకు పని చేస్తుంటుంది.

ఎవరీ ఇష్రాత్ జహాన్..?

ఇక.. ఇష్రాత్ కథలోకి వెళితే.. 2004 జూన్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారులో ఒక వివాదాస్పద ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇష్రాత్ తో పాటు.. జావేద్ షేక్.. అమ్జద్ అలీ.. జీషన్ జోహాలు హతమయ్యారు. వీరంతా నాటి ముఖ్యమంత్రి మోడీని మట్టుబెట్టేందుకు వచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులిమింది. అనవసరంగా అమాయకుల్ని పొట్టన బెట్టినట్లుగా వాదించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన ఇష్రాత్ ఎన్ కౌంటర్ నకిలీదని చెబుతూ.. 2013లో చార్జ్ షీట్ దాఖలు చేశారు. తాజాగా ఉగ్రవాది హాడ్లీ వాంగూల్మంతో ఇష్రాత్ అసలు రంగు ఏమిటో లోకానికి తెలిసిపోయింది.