Begin typing your search above and press return to search.

హారిబుల్: టీవీ నటి తల చెత్త బుట్టలో

By:  Tupaki Desk   |   8 Feb 2016 8:02 AM GMT
హారిబుల్: టీవీ నటి తల చెత్త బుట్టలో
X
చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. శశిరేఖ అనే టీవీ నటి దారుణ హత్యకు గురైంది. ఆమె తల ఓ చెత్త కుండీలో దొరకడం గమనార్హం. తల లేని ఆమె మొండాన్ని రామాపురం ప్రాంతంలో కనుగొన్న పోలీసులు.. తలను మాత్రం కోలప్కాకంలోని ఓ నదిలో కనుగొన్నారు. శశిరేఖ రెండో భర్త ఈ హత్య వెనుక పాత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శశిరేఖ ఇంత దారుణంగా హత్యకు గురికావడం.. ఆమె తల - మొండెం వేర్వేరు ప్రాంతాల్లో దొరకడం పట్ల తమిళ టీవీ పరిశ్రమ షాక్ కు గురైంది.

36 ఏళ్ల శశిరేఖకు మొదటి భర్తతో విడాకులయ్యాయి. ఆమెకు 8 ఏళ్ల కొడుకున్నాడు. గత ఏడాది 34 ఏళ్ల రమేష్ శంకర్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించి టాలెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు రమేష్. గత ఏడాది ఆగస్టులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఐతే నాలుగు నెలల్లోనే వీళ్లిద్దరికీ విభేదాలు వచ్చాయి.

కేరళకు చెందిన 22 ఏళ్ల అమ్మాయితో సంబంధం పెట్టుకున్న రమేష్.. శశిని దూరం పెట్టాడు. ఆ అమ్మాయి సినిమా అవకాశాల కోసం కేరళ నుంచి చెన్నైకి వచ్చింది. ఆమెకు రమేష్ గార్డియన్ లాగా వ్యవహరిస్తూ తనతోనే ఉంటున్నాడు. ఈ విషయంలో శశిరేఖ గొడవ పెట్టేసరికి ఆమె ప్రాణాలే తీసేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శశిరేఖ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేష్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.