Begin typing your search above and press return to search.

పవన్‌ వైఖరి మారిందా..?

By:  Tupaki Desk   |   23 Jan 2019 9:30 AM GMT
పవన్‌ వైఖరి మారిందా..?
X
ఏపీలో రాజకీయ వాతావరణం మెళ్లగా వేడెక్కతోంది. మరొ కొద్ది నెలల్లోనే శాసనసభతో పాటు లోక్‌ సభ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహవంతులు రెడీ అవుతున్నారు. వీరిలో డాక్టర్లు, లాయర్లు, ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం. అయితే టీడీపీ, వైసీపీలో వీరికి ఛాన్స్‌ లేదు. ఎందుకంటే ఆ పార్టీలో వేళ్లు పట్టుకొన్ని ఈగుతున్నవారు ఎందరో ఉన్నారు. అందువల్ల కొత్తవారికి టిక్కెట్టు దక్కాలంటే ఎంతో పెద్ద ప్రయత్నాలు చేయాలి. అందుకని వారంతా పవన్‌ కల్యాన్‌ పార్టీ జనసేనను నమ్ముకొన్నారు. జనసేన తరుపున పోటీ చేసేందుకు కొందరు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని ఇక్కడి వచ్చారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

2008లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అప్పుడు చిరు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే ఉద్యోగాలు, ఉన్నతస్థాయిని వదులుకొని ప్రజారాజ్యం టీకెట్‌ ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఎందుకంటే చివరి నిమిషంలో కొందరిని ఇతర పార్టీ నుంచి చిరు లాగడం వారిని పోటీలో నిలబెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా పవన్‌ అదే పని చేస్తాడా..? అని అందరిలో చర్చ మొదలైంది.

పవన్‌ చిరులా ఇతర పార్టీల నాయకులను తీసుకోవడం జరుగుతుందో లేదో గానీ.. టీడీపీతో పొత్తు విషయంలో ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో ఇప్పటి వరకు టీడీపీపై కోపంతో ఉన్న వారు జనసేన నుంచైనా పోటీ చేసి గెలవాలని ఆశించేవారికి మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవల చంద్రబాబు నాయకుడు ఓ సందర్భంగా జనసేనతో పొత్తు ఉంటే తప్పేంటే అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌ లు ఇచ్చారు గానీ.. పవన్‌ మాత్రం కనీసం కామెంట్‌ కూడా చేయలేదు. దీంతో ఈ ఎన్నికల్లో పవన్‌ టీడీపీతో కలిసి వెళ్లనున్నాడా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.

జనసేన పార్టీ ప్రారంభం నుంచి పవన్‌ వైఖరితో కొందరు నాయకులు ఇప్పటికే దూరం అవుతున్నారు. మొదటి నుంచి 'ప్రశ్నించే పార్టీ' అని చెప్పుకోవడంతో చాలా మంది పవన్‌ వెంట నడిచారు. అంతేకాకుండా కార్మికోద్యమ పార్టీలైన కమ్యూనిస్టులు కూడా పవన్‌కు తోడుగా ఉన్నారు. కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పవన్‌ కలిసేందుకు వస్తే కనీసం అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వలేదని ప్రచారం జరగడంతో 'ప్రశ్నించే పార్టీ' వైఖరి మారిందా..? అనే వాదన లేవనెత్తింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీ తరుపున అలజడి ఏమాత్రం కనిపించడం లేదు. ఓవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా పవన్‌ పార్టీ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంది. దీంతో ఈ పార్టీ తరుపున టికెట్‌ ఆశించిన వారిపై నీళ్లు చల్లే అవకాశం లేపోలేదని చర్చించుకుంటున్నారు. ఎన్నికలు వచ్చి మీద పడ్డాకా పవన్‌ ఒక్కసారి టీడీపీతో కలిసి వెళ్తాం అన్నా కూడా కొత్తేమీ కాదని .. ఎందకని అడిగితే ఆ పార్టీ అభివృద్ధి చేయగలదని పవన్‌ ప్రచారం కూడా చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.