Begin typing your search above and press return to search.

మరో వికెట్‌.. వైసీపీలోకి కావూరి.?

By:  Tupaki Desk   |   17 Feb 2019 8:01 AM GMT
మరో వికెట్‌.. వైసీపీలోకి కావూరి.?
X
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైసీపీలో జాయిన్ అవుతున్నారా.? ఈ మేరకు ఆయనకు జగన్‌ నుంచి హామీ లభించిందా అంటే ఔననే సమాధానం విన్పిస్తుంది. ప్రస్తుతం కావూరి సాంబశివరావు బీజేపీలో ఉన్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి అందరికి తెలిసిందే కదా. దీంతో ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఫిక్స్‌ అయిన కావూరి.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కావూరి ఎంట్రీకి జగన్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ని కాదని బీజేపీలో చేరారు కావూరి సాంబశివరావు. అయితే బీజేపీ కంటే ముందు టీడీపీలో చేరాలి అనుకున్నారు. కానీ టీడీపీలో ఉన్న కొన్ని వర్గాలు ఆయన్ను రానివ్వలేదు. దీంతో.. బీజేపీలో చేరి ఏలూరు నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఏలూరు టీడీపీకి, కైకలూరు బీజేపీకి వెళ్లింది. దీంతో.. ఆయన పోటీకి దూరంగా ఉండిపోయారు. అప్పటినుంచి రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. అయితే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం. అందుకే.. వైసీపీలో చేరి ఏలూరి నుంచి ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నారు.

టీడీపీకి దూరంగా ఉన్నా కూడా కావూరికి టీడీపీ నేతలతో బంధుత్వాలు ఉన్నాయి. కావూరి అల్లుడు, బాలయ్య ఇద్దరూ వియ్యంకులు. ఇక కావూరి మనవడు శ్రీ భరత్‌ బాలయ్య చిన్నల్లుడే. అంతేకాదు శ్రీభరత్‌ కూడా వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో టీడీపీకి వెళ్తే.. ఒక ఫ్యామిలీకి ఇన్నే టిక్కెట్లు అని చెప్పి కావూరికి ఎంపీ సీట్‌ మిస్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే.. కావూరి వైసీపీని ఎంచుకున్నారని టాక్‌. మరి గతంలోనే ఏలూరి ఎంపీ టిక్కెట్‌ను కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌కు ఇస్తానని జగన్‌ చెప్పారు. మరి ఇప్పుడు ఇద్దరికి ఎలా సర్దుబాటు చేస్తోరో .. వెయిట్‌ అండ్‌ సీ.