Begin typing your search above and press return to search.

సింధుకు ప‌త‌కం బాబు పుణ్య‌మా వైఎస్ పుణ్య‌మా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 9:11 AM GMT
సింధుకు ప‌త‌కం బాబు పుణ్య‌మా వైఎస్ పుణ్య‌మా?
X
ఒలింపిక్సులో పీవీ సింధుకు ప‌త‌కం రావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్ప‌డంపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు ఇంకా ఆగ‌డం లేదు. మాజీ ఎంపీ హర్షకుమార్ దీనిపై తీవ్రంగా స్పందించారు. సింధు విజయంలో తన పాత్ర ఉందని చంద్రబాబు చెప్పుకోవడం న‌వ్వు తెప్పిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల - గుగూల్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఎంపికైనప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారని ఆయ‌న ఎద్దేవా చేశారు.

పుల్లెల గోపిచంద్ అకాడమీ తన వల్లే డెవ‌ల‌ప్ అయింద‌ని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే గోపిచంద్ అకాడమీ అభివృద్ధి చెందిందని చెప్పారు. అకాడమీ అభివృద్ధి ఫీజు రూ. 1.2 కోట్లను రద్దు చేసింది వైఎస్ అయితే చంద్ర‌బాబు దానికోసం చేసిందేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పరిపాలనను గాలికొదిలేసి పుష్కరాల పేరుతో సమయాన్ని వృధా చేశారని చంద్రబాబుపై ఆయ‌న మండిపడ్డారు.

రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం - ప్రత్యేక హోదా సాధించడం వంటి పనులను గాలికొదిలేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పుష్కరాలతో కాలక్షేపం చేశారని హర్షకుమార్ ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డం మానేసి ప్ర‌చార పిచ్చిని వ‌దులుకుంటే బెట‌ర‌ని ఆయ‌న సూచించారు.