Begin typing your search above and press return to search.

పోకేమాన్ ఫీవర్ తగ్గకుండానే పోటర్ ఫీవర్

By:  Tupaki Desk   |   28 July 2016 9:30 PM GMT
పోకేమాన్ ఫీవర్ తగ్గకుండానే పోటర్ ఫీవర్
X
పోకేమాన్ ఫీవర్ లో మునిగిన ప్రపంచానికి మరో కొత్త ఫీవర్ కూడా వచ్చింది. అది హ్యారీపోట‌ర్ ఫీవ‌ర్.. మ‌రో మూడు రోజుల్లోనే హ్యారీపోట‌ర్ ఎనిమిదో ఎడిష‌న్ రిలీజ్ కానుండటంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు దానికి ఘన స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. తొమ్మిదేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత వ‌స్తున్న పుస్త‌కం కావ‌డంతో అభిమానుల్లో ఆతృత మ‌రింత పెరిగిపోయింది. ఎనిమిదో ఎడిష‌న్ హ్యారీపోట‌ర్ అండ్ ద క‌ర్స్‌ డ్ చైల్డ్ బుక్‌ ను జులై 31న ఉద‌యం 11.30 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఏడో ఎడిష‌న్ హ్యారీపోట‌ర్ అండ్ ద డెత్‌ లీ హాలోస్ ఎక్క‌డ ముగుస్తుందో అక్క‌డి నుంచో ఈ కొత్త బుక్ మొద‌ల‌వుతుంది.

కాగా గ‌త పుస్తకాలలాగే ఇది కూడా అమ్మ‌కాల్లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌బ్లిష‌ర్ హాషెట్ ఇండియా ఎండీ థామ‌స్ అబ్ర‌హం చెబుతున్నారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు - ఫ్యాన్ ఈవెంట్స్‌ - బుక్‌ స్టోర్స్‌ లో పార్టీలు.. ఇలా పుస్త‌కం విడుద‌ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కంగా మ‌ల‌చ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు సిద్ధమవుతున్నారు.

ఇండియాలోనూ హ్యారీపోట‌ర్ ఫీవ‌ర్ తారాస్థాయికి చేరింది. ఢిల్లీ - చెన్నై - ముంబై - బెంగ‌ళూరు లాంటి మెట్రో న‌గ‌రాల్లో బుక్ రిలీజ్ రోజు ఈవెంట్స్ ఆర్గ‌నైజ్ చేయ‌నున్నారు పోట‌ర్ అభిమానులు. పబ్లిష‌ర్ హ్యాషెట్ ఇండియా కూడా అభిమానుల‌కు ఓ కాంటెస్ట్ నిర్వ‌హిస్తోంది. ఇందులో గెలిచిన ఇద్ద‌రు ల‌క్కీ ఫ్యాన్స్‌ కు ర‌చ‌యిత సంత‌కం చేసిన ఎనిమిదో ఎడిష‌న్ పార్ట్ వ‌న్‌ - పార్ట్ టూ బుక్స్‌ ను అంద‌జేయ‌నున్నారు. షాపూర్‌ - గుర్గావ్‌ లాంటి చిన్న న‌గ‌రాలు కూడా అభిమానుల కోసం ఈవెంట్స్ ఆర్గ‌నైజ్ చేయనున్నాయి.