Begin typing your search above and press return to search.

ఈ జ‌న్మ‌కిది చాల‌ని హ‌రీశ్ అందుకే అన్నార‌ట‌!

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:50 AM GMT
ఈ జ‌న్మ‌కిది చాల‌ని హ‌రీశ్ అందుకే అన్నార‌ట‌!
X
గ‌డిచిన మూడు రోజులుగా మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ సంచ‌ల‌నం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి.. కేసీఆర్ మేన‌ల్లుడు.. టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీశ్ నోటి నుంచి వ‌చ్చిన ఒక మాట తీవ్ర‌మైన సంచ‌ల‌నం సృష్టించ‌టం తెలిసిందే. ఈ జ‌న్మ‌కు ఇది చాలు.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటే బాగుంటేందేమో అంటూ హ‌రీశ్ నోటి నుంచి వ‌చ్చిన మాట అన్ని మీడియాల‌లోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

ఆ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట వీడియో భారీగా వైర‌ల్ అయ్యింది. ఇలాంటి వేళ‌.. ఈ వ్య‌వ‌హారంపై హరీశ్ ఏం చెబుతారు? ఆయ‌న నోటి నుంచి ఆ మాట‌లు ఎందుకు వ‌చ్చాయి? అన్న ప్ర‌శ్న‌ను ఒక మీడియా సంస్థ జ‌రిపిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సంధించింది.

దీనికి హ‌రీశ్ రియాక్ట్ అయ్యారు. ఆయ‌న ఏమ‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పింది య‌థాత‌ధంగా చూస్తే..

"ఇందులో ఎలాంటి సంచలనం లేదు. ఆరోజు భారీ వర్షం పడుతున్నా ప్రజలు అనూహ్యంగా తరలివచ్చారు. బోనాలు - మంగళహారతులతో గ్రామం మొత్తం కదిలివచ్చింది. ప్రజల ఆదరణ చూసి భావోద్వేగానికి గురై జీవితంలో ఇంకేం కావాలి అనే ఉద్దేశంతోనే అన్నా తప్ప మరొకటి కాదు"

"నాకేం నిరాశ ఉంటుంది? కేసీఆర్‌ మళ్లీ నాకు సిద్దిపేట టికెట్‌ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు గ్రామాలు తెరాసకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. అద్భుతమైన మెజార్టీతోనే గెలుస్తాననే నమ్మకం ఉంది. ఇంకో అభిప్రాయానికి తావు లేదు. మేమందరం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్నాం. వంద సీట్లు గెలుస్తాం" "విశ్వసనీయతకు పెట్టింది పేరు కేసీఆర్‌. ఆయన అద్భుత ప్రగతి తెచ్చారు. ఈ రాష్ట్రంలో సుస్థిర పరిపాలన కావాలంటే కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజల్లో కూడా స్పష్టత ఉంది. కాంగ్రెస్‌ వాళ్లు వస్తే ఏడాదికో సీఎం వస్తారు. ప్రతిపక్షంలో ఉంటేనే కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు. గతంలోనూ మనం చూశాం. చెన్నారెడ్డి పోయి జనార్ధన్‌ రెడ్డి వచ్చారు. రాజశేఖరరెడ్డి దురదృష్టవశాత్తూ చనిపోతే రోశయ్య.. ఆయన ఏడాదికే దిగిపోయి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వచ్చారు"