Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు హరీశ్ బహిరంగ లేఖ..

By:  Tupaki Desk   |   8 Nov 2018 6:42 AM GMT
చంద్రబాబుకు హరీశ్ బహిరంగ లేఖ..
X
తెలంగాణ ఎన్నికల్లో తమను ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఉద్దేశించి టీఆరెస్ ఎదురుదాడి తీవ్రం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఆపద్ధర్మ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. హరీశ్ రావు ఆ బహిరంగ లేఖలో 18 అంశాలను ప్రస్తావించారు.

18 ప్రశ్నలు ఇవే...
1. నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా?
2. పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా?
3. కాళేశ్వరంపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా?
4. పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?
5. కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా?
6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?
7. పోలవరానికి బదులు కృష్ణాకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడటం లేదా?
9. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దన్నది మీ కుతంత్రం కాదా?
10. ఎవరి అనుమతితో ఏపీలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు.
11. పోలవరం ముంపు మండలాలు అన్యాయంగా గుంజుకోలేదా?
12. సీలేరు విద్యుత్ ప్లాంటు తీసుకోవడం వల్ల తెలంగాణకు ఏడాదికి రూ.500 కోట్లు నష్టం చేయలేదా?
13.విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2వేల 465 మెగావాట్ల విద్యుత్ ఎగ్గొట్టలేదా?
14. తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రూ.4వేల 557కోట్ల నష్టం కలిగించలేదా?
15. ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్ టెండర్లలో పాల్గొనడం మీ కుచితత్వం కాదా?
16. 1,153 మంది ఆంధ్రా విద్యుత్ ఉద్యోగుల్ని ఏపీకి తీసుకోకుండా మాపై రూ.వెయ్యికోట్ల భారం పడటానికి మీరు కారణం కాదా?
16. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నా.. మాకు అప్పగించకపోవడం సంకుచిత బుద్ధి కాదా?
17. హైదరాబాద్ ఆస్తుల్లో వాటా కోరటం దురాశ కాదా?
18. విభజన మాయని గాయం అని మీరు బాధపడలేదా?


కాగా సరిగ్గా నెల కిందట పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా హరీశ్ ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో ఉత్తమ్‌కు ఆయన 12 ప్రశ్నలు సందించారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా లేఖ రాయడంతో ఆ రెండు పార్టీలను ఎదుర్కోవడానికి టీఆరెస్ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.