Begin typing your search above and press return to search.

హాట్ ఫొటోలు పంపితే..హైద‌రాబాద్‌ లో ఐటీ ఉద్యోగం

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:30 PM GMT
హాట్ ఫొటోలు పంపితే..హైద‌రాబాద్‌ లో ఐటీ ఉద్యోగం
X
హెడింగ్ చూసి షాక‌వ్వకండి. నిజ‌మే. నిజంగా నిజ‌మే. ఉద్యోగం కావాలంటే టాలెంట్ ఉండ‌టమో కొత్త నైపుణ్యాల‌ను నేర్చుకోవ‌డం కాద‌ట‌. కేవలం న‌గ్న చిత్రాల‌ను పంపితే చాల‌ట‌. యువ‌త‌లో పిచ్చి క్రేజ్ ఉన్న‌ ఐటీ ఉద్యోగం వ‌చ్చేస్తుంద‌ట‌...ఔనా?ఇంత‌కీ ఏంటా చెత్త కంపెనీ అని అనుకుంటున్నారా? క‌ంపెనీ ఈ ష‌ర‌తు పెట్ట‌లేదు. ఆ కంపెనీలో ప‌నిచేసే హెచ్ ఆర్ మేనేజ‌ర్ ఈ కండీష‌న్ పెట్టాడు. దీంతో విష‌యం షీ టీమ్స్ దృష్టికి వెళ్లి మ‌నోడి బండారం బ‌య‌ట‌ప‌డింది.

షీ టీమ్స్ ఇంచార్జ్జి, నగర అదనపు పోలీస్ కమిషనర్(క్రైం) స్వాతి లక్రా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... హిమాయత్‌ నగర్‌ కు చెందిన బీ నరేందర్‌ సింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ ఆర్ హెడ్‌ గా పనిచేస్తున్నాడు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఐటీ ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ఇంటర్వ్యూ చేశాడు. రిజల్ట్స్ తర్వాత చెప్తామంటూ ఆమె ఫోన్ నంబర్ తీసుకొని, తన నంబర్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి తన ఉద్యోగం ఏమైందంటూ నరేందర్‌ సింగ్‌ కు వాట్సప్‌ లో మెసేజ్ పంపగా.. హాట్ ఫొటోలు పంపించాలంటూ రిైప్లె ఇచ్చాడు. దీంతో షాక్ తిన‌డం స‌ద‌రు యువతి వంతు అయింది. ఫొటోలు పంపించడానికి నిరాకరించింది.

అయితే ఉద్యోగం మీద ఆమెకు ఆశ‌లు ఉన్నాయి కాబ‌ట్టి...ఆ తర్వాత రెండుమూడు రోజులకు మళ్లీ వాకబు చేసింది. ``నేను ఇది వరకే చెప్పా. నీ హాట్ ఫొటోలు పంపిస్తేనే ఉద్యోగం వస్తుంది. లేకుంటే ఇక్కడే కాదు.. చాలా కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది` అని బెదిరించాడు. అంతేకాదు చెప్పినట్టు చేస్తే మంచి ఉద్యోగంలో పెట్టిస్తానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. విసిగిపోయిన బాధితురాలు షీ టీమ్స్‌ ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని షీ టీమ్స్ అరెస్ట్ చేశాయి.