Begin typing your search above and press return to search.

హెచ్‌1బీపై మ‌రో షాకిచ్చేందుకు అమెరికా రెడీ

By:  Tupaki Desk   |   25 March 2017 9:53 AM GMT
హెచ్‌1బీపై మ‌రో షాకిచ్చేందుకు అమెరికా రెడీ
X
వ‌ల‌స ఉద్యోగుల‌కు వ‌ర‌ప్ర‌దాయిని అయిన హెచ్‌1బీ వీసాల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేందుకు అమెరికాలో అధికార ప్ర‌తిప‌క్షాలు ఏక‌మవుతున్నాయి. ప్రతినిధుల సభ ఎంపీలు డెరెక్‌ కిల్మర్‌ ( డెమోక్రటిక్‌ పార్టీ ) - డఫ్‌ కోలిన్స్‌లు ( రిపబ్లికన్‌ పార్టీ ) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చట్టసభలో వారు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం స్థానిక మీడియాతో వారు మాట్లాడారు. బహుళ జాతీ సంస్థలు హెచ్‌-1బీ వీసాల ద్వారా విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయని, తద్వారా అమెరికాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. పైగా, ఉన్నత స్థాయి కొలువుల్లోనూ విదేశీయులే పనిచేస్తున్నారని చెప్పారు. అమెరికాలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు.

త‌మ‌కు ప్ర‌త్యేకంగా ఎవ‌రిపైద్వేషం లేద‌ని, అమెరికన్ల ప్రయోజనాలే పరమావధిగా ఔట్‌ సోరింగ్‌ ఉద్యోగాల నియామకాలను అడ్డుకోవాలని కోరుతున్నామని స‌ద‌రు ఎంపీలు అన్నారు. హెచ్‌-1బీ వీసాల ద్వారా నైపుణ్యమున్న విదేశీ యువతను ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల్లో నియమించుకుంటున్నామ‌ని అయితే ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. అమెరికా చట్టాల ప్రకారం...స్థానిక యువతకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా హెచ్‌1బీ వీసాల‌ను నియంత్రించి అమెరిక‌న్ల‌కే ఉపాధి క‌ల్పించ‌డానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరారు.

ఇదిలా ఉండగా - పబ్లిక్‌ బ్రాడ్‌ క్యాస్టింగ్‌ సర్వీస్‌ సంస్థ హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్స్‌కు సంబంధించి ఇటీవల ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రసారం చేసింది. స్వదేశంలో విదేశీయులకు ఉద్యోగాలు కల్పించి నట్టయితే స్థానిక యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ఆ డాక్యుమెంటరీని చూసిన అనంతరం తామెంతో దిగ్భ్రాంతి చెందామని అన్నారు. అందుకే, అమెరికాలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశ పెట్టామని అధికార‌ - ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఎంపీలు డెరెక్‌ కిల్మర్‌ - డఫ్‌ కోలిన్స్ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/