డేరా బాబా పీఏకూ ఆ ఆపరేషన్ తప్పలేదు

Thu Oct 12 2017 12:38:38 GMT+0530 (IST)

అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వదలరన్న పేరున్న డేరా బాబాకు సంబంధించి మరో షాకింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇద్దరు సాధ్వీలను లైంగికంగా వేధించిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అందమైన మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేసే డేరా బాబా.. మగాళ్లను సైతం మరోలా వేధించిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.తన ఆశ్రమంలో పని చేసే మగవాళ్లు.. మహిళల్ని చూసేందుకు సైతం అనుమతించకపోవటం తెలిసిందే. అక్కడితో వదలని డేరాబాబా.. ఆశ్రమంలో తన దగ్గర పని చేసే మగాళ్లందరికి వృషణాలను తొలగించి నపుంసకులుగా మార్చిన వైనం బయటకు వచ్చింది. ఆశ్రమంలో పని చేసేందుకు వచ్చే పురుషుల వృషణాలను తొలగించే అంశంపై ఇప్పటికే గుర్మీత్ మీద కేసు ఉంది.

అయితే.. తనకు వ్యక్తిగత సహాయకులుగా ఉండే వారికి కూడా ఇలాంటి శిక్ష తప్పలేదన్న విషయం తాజాగా బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. తనకు భద్రత ఇచ్చే సిబ్బంది మొదలు వ్యక్తిగత సహాయకుల వరకూ అందరిని నపుంసకులుగా మార్చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పురుష/లకు వృషణాలను తొలగించే శస్త్రచికిత్సలు డేరాలోని డాక్టర్లే చేసేవారన్న విషయాన్ని తాజాగా సీబీఐ అధికారులు గుర్తించారు.

మహిళల్ని శృంగారానికి వాడుకున్న గుర్మీత్.. పురుషుల్ని అందుకు భిన్నంగా శృంగారానికి పనికి రాని వారిగా మార్చేయటం గమనార్హం. భగవంతుడిని చేరాలంటే మగతనాన్ని పరిత్యజించి తనను పూజించాలంటూ గుర్మీత్ చెప్పేవారని.. అలా దాదాపు 400 మందికి పైనే వృషణాలను తొలగించినట్లుగా తెలుస్తోంది. చివరకు తన వ్యక్తిగత సలహాదారు రాకేష్‌ను కూడా డేరాబాబా వదల్లేదు. తాను వద్దని ఎంతో వేడుకున్నా గుర్మీత్ వినకుండా తనకు కూడా ఆపరేషన్ చేయించారని అతను వాపోయాడు. అతనికి పరీక్షలు జరిపిన అధికారులు.. అతనికి సైతం వృషణాలు లేకపోవటం గుర్తించి షాక్ తిన్నారు.