Begin typing your search above and press return to search.

టీడీపీ లేడీ లీడ‌ర్ ఆత్మ‌హ‌త్య‌లో అస‌లు కోణం

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:30 AM GMT
టీడీపీ లేడీ లీడ‌ర్ ఆత్మ‌హ‌త్య‌లో అస‌లు కోణం
X
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ప‌ద‌వుల కోసం పోరాటం జ‌రుగుతోందా? మునిసిప‌ల్ స్థాయిలోనే ప‌ద‌వుల కోసం పొలిటిక‌ల్ ప్రెజ‌ర్ ఎక్క‌వవుతోందా? ఇది ఆయా నేత‌లు ప్రాణాలు తీసుకునే దాకా దారితీస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంగా గుంటూరు అవ‌త‌రించాక ఈ జిల్లాలో దిగువ శ్రేణి నాయ‌కులు ప‌ద‌వుల కోసం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేయ‌డం, ఒత్తిళ్లు తేవ‌డం మామూలుగా మారింది. తాజాగా గుంటూరు జిల్లా మాచ‌ర్ల మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేసి.. రాజ‌కీయ ఒత్తిళ్ల కార‌ణంగా మూడు మాసాల కిందట ప‌ద‌వికి రాజీనామా చేసిన గోప‌వ‌ర‌పు శ్రీదేవి ఆత్మ‌హ‌త్య ఉదంతం జిల్లా టీడీపీ స‌హా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఓ మ‌హిళా మాజీ చైర్ ప‌ర్స‌న్‌, పొలిటిక‌ల్ ప్రెజ‌ర్‌తో ఇలా సూసైడ్ చేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. వివ‌రాలు చూద్దాం..

గుంటూరు జిల్లా మాచ‌ర్ల మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో మ‌హిళ‌కు కేటాయించారు. దీనికి 2014లో ఎన్నిక జ‌రిగింది. ఈ క్ర‌మంలో టీడీపీ త‌ర‌ఫున అప్ప‌టికే పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న వైశ్య సామాజానికి వ‌ర్గానికి చెందిన‌ గోప‌వ‌ర‌పు శ్రీదేవి గెలుపొందారు. కొన్నాళ్లు స‌జావుగానే ఆమె కొన‌సాగినా.. రాజ‌ధాని ప్రాంతంగా గుంటూరు పేరు బ‌య‌ట‌కు రాగానే పార్టీలోనే అంత‌ర్గ‌త విభేదాలు, ఒత్తిళ్లు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆమె ప‌ద‌విపై క‌న్నేసిన పార్టీలోని కొంద‌రు శ్రీదేవి భ‌ర్త మ‌ల్లికార్జున రావుపై తీవ్ర‌మైన ఒత్తిడి తెచ్చారు. ప‌ద‌వికి రాజీనామా చేసేలా ఆమెను ఒప్పించాల‌ని ఆయ‌న‌ను ఒత్తిడి చేశారు. ఈ క్ర‌మంలోనే మ‌ల్లికార్జున రావు గుండెపోటుతో చ‌నిపోయారు.

ఇక‌, భ‌ర్త మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా శ్రీదేవి చైర్ ప‌ర్స‌న్‌గానే కొన‌సాగారు. కానీ, పొలిటిక‌ల్ ప్రెజ‌ర్ మ‌రింత పెర‌గ‌డంతో ఆమె మూడు నెల‌ల కింద‌ట త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే, పార్టీని న‌మ్ముకుని కొన్నేళ్లుగా ఉంటున్న త‌మ‌కు పార్టీలోనే అవ‌మానం ఎదురైంద‌ని ఆమె బాధ‌ప‌డేవార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో అనూహ్యంగా శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌ట్టారు. ఇంట్లోనే నురుగులు క‌క్కుకుని ప‌డిపోయిన స్థితిలో ఉన్న శ్రీదేవిని ఆమె మామ బంధువుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అంబులెన్స్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇటు పార్టీలోనూ అటు ఆమె కుటుంబంలోనూ తీవ్ర విష‌దం అలుముకుంది. ఇదిలావుంటే, శ్రీదేవి మ‌ర‌ణానికి కుటుంబ ఆస్తి, అప్పుల వివాదాలు కూడా కార‌ణ‌మ‌ని మ‌రో టాక్ వినిపిస్తోంది.