Begin typing your search above and press return to search.

నీళ్లకు తుపాకీలు పట్టుకొని కాపలా

By:  Tupaki Desk   |   2 May 2016 7:04 AM GMT
నీళ్లకు తుపాకీలు పట్టుకొని కాపలా
X
నీళ్ల కోసం నీటి యుద్ధాలు వస్తాయి సుమా అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్డుల్ కలాం చెబితే.. అలాంటి రోజులు ఎప్పటికి వచ్చేను అని అనుకున్నోళ్లే కానీ.. తామే అలాంటి దుస్థితిని కనులారా చేసే దౌర్బాగ్యం పడుతుందని ఎవరూ అనుకోని పరిస్థితి. అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యం.. పర్యావరణం మీద పాలకులకు పట్టని శ్రద్ధ.. ప్రజల్లో చైతన్యం అంతంతమాత్రమే ఉండటంతో నీటి కొరత ఇప్పటికే ఓ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే.

దారుణమైన కరవు పరిస్థితులతో దేశ వ్యాప్తంగా నీటిదాహం ఎక్కవైపోతోంది. గుక్కెడు నీళ్ల కోసం చాలానే కష్టపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నీటి వనరులు కాస్త ఉన్న.. వాటికి జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. గన్నులు పట్టుకొని మరీ పహరా కాసే పాడు రోజులు వచ్చేశాయి. ఈ ఫోటోను చూస్తే.. నీళ్ల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుంది.

మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ కు చెందిన తికమ్ గఢ్ లో బారీగఢ్ అనే డ్యామ్ ఉంది. దాని మీదనే చుట్టుపక్కల గ్రామాలు బతికే పరిస్థితి. అయితే.. ఈ డ్యామ్ యూపీ సరిహద్దుల్లో ఉండటం.. ఆ రాష్ట్ర రైతుల కన్నుఈ డ్యామ్ మీద పడి.. తరచూ దండయాత్ర చేస్తూ.. నీటి వనరులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో.. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా సాయుధులైన సెక్యూరిటీని ఏర్పాటు చేసి నీటి వనరులు కొల్లగొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో కదా..?