Begin typing your search above and press return to search.

గల్ఫ్ యుద్ధమేఘం.. భారత్ కే నష్టం

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:53 AM GMT
గల్ఫ్ యుద్ధమేఘం.. భారత్ కే నష్టం
X
1990లో వచ్చిన గల్ఫ్ యుద్ధం ప్రపంచాన్నే కుదిపేసింది. గల్ఫ్ దేశాల్లోని చమురు బావులు ధ్వంసమై ప్రపంచంలో పెట్రోల్ దొరక్క ధరలు - పెట్రోల్ ధర భారీగా పెరిగి జనాలు హాహాకారాలు చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది.

ఇప్పుడు మరోసారి అలాంటి ఉపద్రవం వచ్చేందుకు యుద్ధమేఘాలు కమ్ముకోవడం కనిపిస్తోంది.. తాజాగా సౌదీ అరేబియాలోని భారీ చమురు బావులు, చమురు శుద్ది కేంద్రాలపై డ్రోన్లతో దాడి చేశారు. ప్రపంచానికి 6 శాతం పెట్రో ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తాయి. ఈ దాడిలో చమురు బావులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో పెట్రోల్ ఉత్పత్తి నిలిచిపోయి క్రూడాయిల్ ధర ఏకంగా 12 డాలర్లు పెరిగి 67 డాలర్లకు చేరింది.గల్ఫ్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదలగా చెబుతున్నారు.

అయితే సౌదీ అరేబియాపై దాడి చేసినదెవరో తెలియలేదు. యెమెన్ ప్రభుత్వంతో కలిసి అక్కడి హుతీ తిరుగుబాటు దారులపై సౌదీ అరేబియా దేశం పోరాడుతోంది. దానికి ప్రతీకారంగా హుతీ తిరుగుబాటు చేశారా? లేక శత్రుదేశం ఇరాన్ ఈ పనిచేసిందా అన్నదానిపై అనుమానాలున్నాయి.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ డ్రోన్ దాడులు ఇరాన్ పనియేనని నిర్ధారించింది. సౌదీ అరేబియా కనుక ఒప్పుకుంటే ఇరాన్ పై యుద్ధం ప్రకటిస్తామని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో యుద్ధ మేఘాలు కమ్ముకొన్నాయి. గల్ఫ్ యుద్ధం జరిగితే పెట్రోల్ దొరక్క ధరలు ఆకాశన్నింటిని నిత్యావసరాలు చుక్కలు నంటుతాయి.

భారత్ వద్ద కేవలం 65 రోజులకు సరిపడా మాత్రమే పెట్రో నిల్వలున్నాయి. యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే 85శాతం దిగుమతులపై ఆధారపడ్డ భారత్ కుప్పకూలడం ఖాయం. ఆర్థిక వ్యవస్థ పతనమై.. ధరలు పెరిగిపోతాయి. దీంతో గల్ఫ్ యుద్ధం భారత్ తోపాటు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా - సౌదీ అరేబియా కనుక ఇరాన్ పై యుద్ధం ప్రకటిస్తే భారత్ కే నష్టం.. భారత్ కు ఇరాన్, సౌదీలే ప్రధానంగా పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసే దేశాలు కావడం గల్ఫ్ యుద్ధం మనపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది.