Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆ గుజ‌రాతీల పైత్యం..!

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:33 AM GMT
అమెరికాలో ఆ గుజ‌రాతీల పైత్యం..!
X
కొన్ని పైత్యాలు వికారంగా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి అమెరికాలోని గుజ‌రాతీయిలు పుణ్య‌మా అని చోటు చేసుకుంది. గుజ‌రాతీల‌కు దాండియా ఆట‌తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఇక‌.. ద‌స‌రా వ‌స్తుందంటే.. కొన్ని నెల‌ల ముందు నుంచే ప్ర‌త్యేకంగా దాండియా శిక్ష‌ణ తీసుకునేవారు బోలెడంత‌మంది క‌నిపిస్తారు. అలాంటిది.. త‌న పేరు చివ‌ర జానీ అని ఉంద‌ని దాండియా ఆడేందుకు నో చెప్పేసిన వైనం సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో గుజ‌రాతీయ శాస్త్ర‌వేత్త‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఇంత‌కీ నిర్వాహ‌ఖులు అంత క‌ర‌కుగా ఎందుకు వ్య‌వ‌హ‌రించారు? దాండియా ఆట‌కు జానీకి లింకు ఏమిటి? అన్న విష‌యంలోకి వెళితే.. ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా అమెరికాలోని గుజ‌రాతీలంతా క‌లిసి దాండియా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి గుజ‌రాతీ అయిన 29 ఏళ్ల క‌ర‌ణ్ జానీ త‌న స్నేహితురాలితో క‌లిసి కార్య‌క్ర‌మానికి వెళ్లారు.

వ‌రుస‌లో నిలుచున్న త‌ర్వాత‌.. అత‌గాడి గుర్తింపుకార్డులో పేర్లు చ‌దివారు. అందులో క‌ర‌ణ్ జానీగా ఉండ‌టాన్ని చూసి.. హిందూ పేరుగా లేద‌న్న కార‌ణంగా ఆయ‌న్ను బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని కోరారు. ఆయ‌న ప‌క్క‌నే ఉన్న ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్ త‌న స్నేహితుడి ఇంటి పేరు మురుడేశ్వ‌ర్ అని.. తాను క‌న్న‌డ‌-మ‌రాఠీ సంత‌తి వ్య‌క్తిన‌ని ఎంతో చెప్పి చూశారు. అయిన‌ప్ప‌టికీ వారిని దాండియాకు అనుమ‌తించ‌లేదు. బ‌య‌ట‌కు పంపేశారు.

దీంతో.. ఈ చేదు అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియాలో పేర్కొంటూ.. ఒక గుజ‌రాతీకి ఇలాంటి తిర‌స్కార‌మా? అన్న ప్ర‌శ్న‌తో పాటు.. ఇదేమాత్రం స‌రికాదంటూ క‌ర‌ణ్ జానీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేరు చివ‌ర‌న ఉన్న జానీలో హిందువుగా అనిపించ‌క‌పోవ‌టంతో త‌న‌ను అనుమ‌తించ‌క‌పోవ‌టాన్ని స‌రికాదంటున్నారు. త‌న ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియాలో ఆయ‌న పేర్కొన్నారు.

ఖ‌గోళ భౌతిక శాస్త్ర‌వేత్త‌గా ఎంతో పేరు తెచ్చుకున్న త‌న కుమారుడికి ఎదురైన చేదు అనుభ‌వంపై ఇండియాలో ఉన్న ఆయ‌న తండ్రి పంక‌జ్ జానీ తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న గుజ‌రాత్ లోని వ‌డోద‌ర వాసి. ఇలాంటి వికారాలు మ‌నుషుల నుంచి ఎప్ప‌టికి పోతాయో?