Begin typing your search above and press return to search.

మోడీ ఇలాకాలో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌

By:  Tupaki Desk   |   20 July 2017 1:15 PM GMT
మోడీ ఇలాకాలో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌ లో రాష్ట్రపతి ఓటింగ్ సంద‌ర్భంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. గుజ‌రాత్‌ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌ కు పాల్ప‌డ్డారు. ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌ నాథ్‌ కు వాళ్లు ఓటు వేసిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్య‌ర్థికి ఓటేశారు. గుజ‌రాత్‌ లో కోవింద్‌ కు అనుకూలంగా 132 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయ‌గా - మీరా కుమార్‌ కు 49 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బంప‌ర్ మెజారిటీతో కోవింద్ ఇవాళ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఒక్క ఓటు కూడా మీరాకుమార్‌ కు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డున్న మూడు పార్టీలు టీడీపీ - బీజేపీ - వైఎస్సార్సీపీ ఎన్డీయే అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే. అంటే క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌లేదు.

కాగా, భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రామ్‌ నాథ్ కోవింద్‌ కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌ లో ఓ ప్ర‌త్యేక‌మైన ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. 20 ఏళ్ల కింద‌ట రామ్‌ నాథ్‌ తో క‌లిసి దిగిన ఫొటోను, ఇప్ప‌టి ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వం గ‌ల వ్య‌క్తి రాష్ట్రప‌తి ప‌దవికి ఎంపిక‌య్యార‌ని ప్ర‌శంసించారు. కాగా, రాష్ట్రప‌తిగా ఎన్నికైన రామ్‌ నాథ్ కోవింద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో తాను అడుగుపెట్ట‌డం భార‌త ప్ర‌జాస్వామ్య గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన సంద‌ర్భం త‌న‌కు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్ష‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. త‌న విజ‌యాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు రామ్‌ నాథ్ కోవింద్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ప్ర‌త్య‌ర్థి మీరాకుమార్‌ కు కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు - శుభాకాంక్ష‌లు చెప్పారు. దేశ‌ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన బాధ్య‌త‌ను స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని కోవింద్ చెప్పారు.

త‌న‌కు ఓటు వేసిన వారంద‌రికీ యూపీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మీరా కుమార్ కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు మీరా కుమార్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన వారంద‌రికీ మీరా కుమార్ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.