Begin typing your search above and press return to search.

ఉత్త‌రాలు లేవ‌ని కొత్త ప‌ని పెట్టుకున్న పోస్ట్‌ మ్యాన్లు

By:  Tupaki Desk   |   29 April 2016 10:30 PM GMT
ఉత్త‌రాలు లేవ‌ని కొత్త ప‌ని పెట్టుకున్న పోస్ట్‌ మ్యాన్లు
X
జనాలు ఉత్తరాలు రాయడం మర్చిపోయి చాలాకాలం అవుతోంది. ఇంటర్నెట్ - ఈ మెయిల్ - వాట్సాప్ - ఫేస్ బుక్ లాంటివి వచ్చి ఉత్తరాల్ని మరింత వెనక్కి నెట్టేశాయి. ఎప్పుడు.. ఎక్కడ ఎలా ఉన్నా క్షణాల్లో అప్ డేట్ చేసే టెక్నాలజీ ఉండగా పెన్ను తీసుకుని అక్షరాలు రాయాలంటే బాగా బద్ధకంగా మారిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పోస్టల్ సంస్థలకు - పోస్టల్ ఉద్యోగులకు పని తగ్గిపోయింది. ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయట పోస్టల్ కంపెనీలు. ఫిన్లాండ్ లో పోస్టల్ సంస్థకు ఓ కొత్త ఐడియా వచ్చింది.

ఇంత‌కీ ఆ ఐడియా ఏంటంటే...పోస్టల్ ఉద్యోగులు ఉత్తరాలు పంచడంతోపాటు ఎవరైనా కోరితే వారింట్లో గడ్డి కత్తిరిస్తారట. అక్కడ ప్రతి మంగళవారం పోస్ట్ మ్యాన్ లకు అస్సలు పని ఉండటం లేదట. ఎందుకంటే ఉన్న ఉత్తరాలన్నీ సోమవారం పంచేస్తారట. సో మంగళవారం ఖాళీగా ఉండకుండా ఎవరైనా కస్టమర్ తమ ఇంట్లో గడ్డి పెరిగింది కట్ చేయమని ఫోన్ చేస్తే లోకల్ పోస్ట్ మ్యాన్ వెళ్లి గడ్డి కత్తిరించాలట. అందుకు గానూ కస్టమర్లు నెలకు 5000 రూపాయలు చెల్లించాలట. ఇదేం చోద్యం.. అని మనం అనుకున్నా.. అక్కడ జనాలకు.. .పోస్టల్ ఉద్యోగులకు ఈ ఐడియా నచ్చి అలాగే పనిచేసుకుపోతున్నారట. పోస్ట్ మ్యాన్ అంటే మనకు ఉత్తరాలు పంచేవారు. కానీ ఫిన్లాండ్ లో గడ్డి కూడా కత్తిరించేవారు.. అని చెప్పుకోవాల్సి వస్తోంది.