Begin typing your search above and press return to search.

ట్రంప్ సెంచ‌రీ కొట్టడం అంటే అంతే మ‌రి

By:  Tupaki Desk   |   24 April 2017 6:18 AM GMT
ట్రంప్ సెంచ‌రీ కొట్టడం అంటే అంతే మ‌రి
X
రిప‌బ్లికన్ పార్టీ నాయ‌కుడు అమెరికా అధ్యక్ష పీఠమెక్కి డొనాల్డ్‌ ట్రంప్ ఏం చేసినా విభిన్నంగా ఉండాల‌ని త‌పించే మ‌న‌స్త‌త్వం అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌న‌ను తాను సో స్పెష‌ల్ అని భావించుకునే ట్రంప్ అగ్ర‌రాజ్యం అధికార ప‌గ్గాలు చేప‌ట్టి వంద రోజులు పూర్తి కావస్తున్న సంద‌ర్భానికి గ్రాండ్‌ గా సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్రంప్ వెల్ల‌డించారు మ‌రి.

ఏప్రిల్‌ 29 నాటికి ట్రంప్‌ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తవుతుంది. దీంతో ఆ రోజున పెన్సుల్వేనియాలో పెద్ద ర్యాలీ చేపడతానని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తన 100వ రోజును అబ్బుర‌ప‌రిచే రీతిలో పెద్ద ర్యాలీతో నిర్వహిస్తానని ట్రంప్ ప్ర‌క‌టించారు. అయితే అదే రోజున శ్వేతసౌధంలో కరెస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ డిన్నర్‌ నిర్వహిస్తున్నారు. వైట్‌ హౌస్‌ లో వార్తలు కవర్‌ చేసే మీడియా వర్గాల అసోసియేషన్‌ ఇది. వీరు ఏటా శ్వేతసౌధంలో విందు ఏర్పాటుచేస్తారు. చాలా మంది దేశాధ్యక్షులు ఈ విందుకు హాజరవుతారు. కానీ ట్రంప్‌ మాత్రం డిన్నర్‌ ను మానుకొని పెన్సుల్వేనియాలో ర్యాలీ చేస్తానని ట్వీట్‌ చేయడం ఆసక్తిగా మారింది.

అయితే ఈ ఏడాది శ్వేతసౌధం విందులో తాను పాల్గొనబోనని ట్రంప్‌ ముందే ప్రకటించడం గమనార్హం. తన విషయంలో మీడియా కవరేజ్‌ పై అసంతృప్తిగా ఉన్నానని, అందుకు నిరసనగానే తాను ఈ విందుకు హాజరుకావట్లేదని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ తో పాటు ఆయన సిబ్బంది కూడా ఈ డిన్నర్‌ లో పాల్గొనడంలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/