గవర్నర్ ఢిల్లీ టూర్ తో తెలంగాణకు గుడ్ న్యూస్

Thu May 18 2017 21:49:48 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సుదీర్ఘకాలంగా ఊరిస్తున్న అంశానికి గ్రీన్ సిగ్నల్ దక్కిందని వార్తలు వెలువడుతున్నాయి. నూతన సచివాలయం నిర్మాణానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరే తీపి కబురు వినిపించింది. తెలంగాణలో నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్స్ స్థలం ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. నిన్న రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పరేడ్ గ్రౌండ్స్ స్థలాన్ని తెలంగాణకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానికి తెలంగాణ ప్రభుత్వం తరపున గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.తాజాగా ఢిల్లీ కేంద్రంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెక్రటేరియెట్ కోసం 100 ఎకరాల బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో పాటుగా సికిందరాబాద్ లోని పారడైజ్ హోటల్ నుంచి నుంచి షామీర్‌పేట వద్ద ఉన్న ఒఆర్ ఆర్ వరకూ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నారు. అలాగే పారడైస్ ఉంచి బోయిన్ పల్లి వరకూ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీనికోసం రక్షణ శాఖ భూములను వినియోగించుకోనున్నారు. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం రక్షణ శాఖకు వెయ్యి ఎకరాల స్థలం ఇవ్వనుంది. హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ లో పొరుగున ఉన్న వనపర్తిలలో వెయ్యి ఎకరాల స్థలాన్ని రక్షణ శాఖ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం చూపించింది. కాగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/