Begin typing your search above and press return to search.

ములాయంకు అమీర్ మాటలు బాగా నచ్చేశాయి

By:  Tupaki Desk   |   25 Nov 2015 9:44 AM GMT
ములాయంకు అమీర్ మాటలు బాగా నచ్చేశాయి
X
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు రాజకీయాల ఆధారంగా కొందరు రాజకీయ నేతు మాత్రం అమీర్ కు అండగా నిలవటం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా సమాజ్ వాద్ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ చేరారు. దేశంలో అసహనం పెరిగిందని.. ఒకదశలో తాము దేశాన్ని వీడిపోయే విషయంలో తన భార్య కిరణ్ రావ్ చర్చించినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా అగ్రహావేశాలు వ్యక్తమైతే.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు అండగా నిలిచారు.

తాజాగా అమీర్ ఖాన్ మాటలపై స్పందించిన ములాయం.. దేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లు పేర్కొన్నారు. అమీర్ ఖాన్ వెల్లడించిన వ్యాఖ్యలపై కేంద్రం ఆయనతో మాట్లాడాలని.. అతడి వ్యాఖ్యల వెనుకున్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ములాయం మాటలు చూస్తుంటే.. దేశం మీద అభిమానం ఉన్నా లేకున్నా.. దేశంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని వ్యక్తిగతంగా ఆపాదించుకొని.. అనవసరమైన భయాల్ని మోసే వారితో ప్రభుత్వాలు చర్చలు జరపాలన్న మాట.

అమీర్ విషయంలో ఇన్ని మాటలు చెబుతున్న ములాయం.. తమ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో.. అత్యాచార బాధితులు తమ మొరను చెప్పుకోవటానికి వచ్చిన మహిళను.. తన పార్టీకి చెందిన మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడిన విషయాన్ని ఎందుకు మర్చిపోయినట్లు? అలాంటి బాధితురాల్ని పిలిపించుకొని ఆమెకు న్యాయం చేయటం చేతకాని ములాయం లాంటి వారు మాత్రం బయటకు నీతులు బాగానే చెబుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.