Begin typing your search above and press return to search.

తెలుగు హీరోకి ఫిదా అయిన తమిళ దర్శకుడు!

By:  Tupaki Desk   |   15 Sep 2019 1:30 AM GMT
తెలుగు హీరోకి ఫిదా అయిన తమిళ దర్శకుడు!
X
ఈ మధ్య మన హీరోలు ఎక్కువగా తమిళ దర్శకులతో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేస్తున్న కోలీవుడ్ దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. అందులో తిరు కూడా ఒకరు. తమిళ్ లో ఓ నాలుగు సినిమాలు చేసాడు తీరు. అందులో మూడు విశాల్ సినిమాలే. అయితే ఇప్పుడీ దర్శకుడు తెలుగులో గోపిచంద్ తో 'చాణక్య' సినిమా చేసాడు.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ ను గోపిచంద్ హ్యూమన్ గురించి ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాడు తీరు. గోపి గారు ఎప్పుడూ మానిటర్ దగ్గరకి వచ్చి చూసుకున్నదే లేదు మీకు ఓకేనా అని ఆగిడేవారు. షూటింగ్ లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదని తెలిపాడు. అంతే కాదు షూటింగ్ స్పాట్ లో గోపి గారికి యాక్సిడెంట్ జరిగిందని అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని ఆ సమయంలో సినిమా ఆగిపోతుందని భయం వేసిందని అప్పుడు జస్ట్ రెండు నెలలు అంటూ ICU లో ఉండి తనకి చెప్పి రెండు నెలల్లో మళ్లీ షూట్ లో జాయిన్ అయ్యారని చెప్పాడు.

ఇదే వేదికపై గోపిచంద్ హ్యూమన్ గురించి నిర్మాత - రచయిత కూడా మాట్లాడారు.సో అలా గోపిచంద్ మంచితనానికి ఓ తమిళ దర్శకుడు ఫిదా అయ్యాడు. మరి గత కొంత కాలంగా వరుసగా ప్లాప్ లు అందుకుంటున్న గోపిచంద్ 'చాణక్య' తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.