Begin typing your search above and press return to search.

గూగుల్ చెప్తోంది:మోడీ ఓ స్టుపిడ్ ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   23 May 2016 12:29 PM GMT
గూగుల్ చెప్తోంది:మోడీ ఓ స్టుపిడ్ ప్ర‌ధాని
X
నిజ‌మే. గూగుల్ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని స్టుపిడ్ ప్ర‌ధాని అని ప్ర‌క‌టిస్తోంది మ‌రి. స్టుపిడ్‌ అనేంత త‌ప్పు మోడీ ఏం చేశారో చెప్ప‌డం లేదు కానీ ఈ సెర్చింజ‌న్ దిగ్గ‌జం న‌రేంద్రుడిని ఆ విధంగా నామోషీ చేసి పారేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే గూగుల్‌ లో మోస్ట్ స్టుపిడ్ ప్రైమ్ మినిస్ట‌ర్స్ అని సెర్చ్‌ లో వెత‌క‌డం ప్రారంభిస్తే వ‌చ్చే ప‌దిమంది ప్ర‌ధాన‌మంత్రుల్లో న‌రేంద్ర‌మోడీ ఒక‌రు. ఈ లిస్ట్‌ లో ఇంకా ఉన్న‌వాళ్లు ఎవ‌రంటే...బ్రిటిష్ ప్ర‌ధాని డేవిడ్ కేమరూన్ - కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ - ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఎబోట్ - టర్కీ ప్రెసిడెంట్ రిసెప్ తయ్యిప్ ఎర్డోగెన్ ఉన్నారు.

అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రమైన విష‌యం ఏంటంటే ప్ర‌ధ‌నామంత్రి ప‌ద‌విని నరేంద్ర‌మోడీ చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఈ సెర్చ్ రిజ‌ల్ట్ రావ‌డం బీజేపీ సానుభూతిప‌రుల‌కే కాదు ఒకింత భార‌తీయుల‌కు సైతం అసంతృప్తికి కార‌ణం అవుతోంది. గూగుల్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ విధంగా చేసి ఉంటుందేమో అనే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకంటే గ‌తంలో ఒక‌సారి ప్ర‌పంచంలో ప‌దిమంది క్రిమిన‌ల్స్ జాబితా గురించి గూగుల్‌ లో సెర్చ్ చేసిన‌పుడు ఇదే విధంగా మోడీ పేరును గూగుల్ ప్ర‌స్తావించింది. కొద్దికాలం త‌ర్వాత త‌ప్పిదాన్ని గ‌మ‌నించిన గూగుల్ దాన్ని స‌రిదిద్దుకుంది. అయితే ఇపుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తుండ‌టంతో ఈ సెర్చింజ‌న్ దిగ్గ‌జం త‌న‌ను తాను న‌లుగురి నోళ్లలో నానేందుకు వేసే ఎత్తుగ‌డగా భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఇదేం చీప్ ట్రిక్స్ అంటూ నొస‌లు విరుస్తున్నారు కూడా.