Begin typing your search above and press return to search.

50 వేల దిశగా బంగారం..

By:  Tupaki Desk   |   9 Feb 2016 10:30 PM GMT
50 వేల దిశగా బంగారం..
X
చాలాకాలంగా ధర పెరగడమే తప్ప తగ్గడం తెలియని బంగారం గత ఏడాది కాలంగా భారీగా తగ్గింది. అయితే.. కొద్ది రోజులుగా మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులను బట్టి సమీప భవిష్యత్తులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు 50 వేల రూపాయలకు చేరినా చేరొచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం 9 నెలల గరిష్ట స్ధాయికి చేరుకున్న బంగారం ధరలు మరోసారి తగ్గే అవకాశాలు లేవని, స్టాక్ మార్కెట్ల పతనం, ముడిచమురు ఉత్పత్తి తగ్గకపోవడం, చైనాలో నెలకొన్న మాంద్యం, ఉగ్రవాద భయాలు తదితర కారణలు స్టాక్ మార్కెట్లతో పోలిస్తే బులియన్ మార్కెట్ ను ఆకర్షణీయం చేశాయని, దీని ఫలితంగా త్వరలోనే బంగారు ధర రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నట్టు బులియన్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో అక్టోబర్ తరువాత ఔన్సు బంగారం ధర 1,174 డాలర్లను దాటగా, ఇండియాలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.27,700 ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్నేషనల్ స్ధాయిలో బంగారం ధర 1,030 నుంచి 1,040 డాలర్ల మధ్య మంచి కొనుగోలు మద్దతు కూడగట్టుకుంది.ఈ నేపధ్యంలో బంగారం పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారని ,అనుకున్న దానికన్నా వేగంగా ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి బంగారం ధరలు పెరుగుతాయన్న తమ అంచనాలు నిజమవుతున్నాయని, ఈ ధశలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బంగారం అత్యుత్తమమని సలహా ఇస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.