''నాష్ విల్ - టెన్నెస్సీలో అలరించనున్న గోదావరి ఆతిథ్యం''

Fri Oct 13 2017 19:30:09 GMT+0530 (IST)

ప్రామాణికమైన రుచులతో నాషవిల్ - టెన్నెస్నీ వాసులను అలరించనున్న గోదావరి.గోదావరి - అమెరికా సంయుక్త రాష్ర్టాలలో అతిపెద్ద మరియు వేగంగా ఎదుగుతున్న సౌత్ ఇండియన్ రెస్టరెంట్ చైన్ తన 20వ కేంద్రాన్ని నాష్ విల్ - టెన్నెస్సీలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. అనూహ్యమైన బ్రాండ్ వ్యాల్యూ మరియు అత్యంత ప్రామాణికమైన రుచులతో విస్తరిస్తున్న గోదావరి తన ఆత్మీయు వంటకాల ప్రియులను అలరించేందుకు దక్షిణ అమెరికాలో మరో కేంద్రాన్ని ప్రారంభిస్తోంది.

కార్పొరేట్ హబ్ కేంద్రంగా ఉండి దాదాపు 20000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న బ్రెంట్ ఉడ్ సిటీ (నాష్ విల్ సబర్బ్)లో గోదావరి నాష్ విల్ (Godavari Nashville) ప్రారంభం కానుంది. టెన్నెస్సీ రాష్ట్రంలో మొట్టమొదటి సౌత్ ఇండియన్ అథెంటిక్ రెస్టారెంట్ గుర్తింపును `గోదావరి` సంతరించుకోనుండటం విశేషం.

“నాష్ విల్ లో మేం పదేళ్లకు పైగా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాం. దక్షిణ భారతీయ వంటకాలకు (South Indian food) ఉన్న ఆదరణ - గోదావరి మాత్రమే ఈ వంటకాలకు అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచిన తీరును గురించి మా అధ్యయనంలో తేలింది. దీంతోపాటుగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న మాకు ప్రత్యక్షంగా కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతున్న గోదావరిలో భాగం పంచుకోవడం మాకు చాలా సంతోషంగా - ఉత్సాహంగా ఉంది” అని గోదావరి నాష్ విల్ రెస్టారెంట్ యజమాని బాబీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 గోదావరి నాష్‌విల్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా అనేక ప్రత్యేకమైన రుచులు వినియోగదారులను అలరించనున్నాయి. “ఇడ్లీ మంచూరియా” -  “రొయ్యల దోశ” - “కుందేలు 999” - “మంగమ్మ మాంసం పులావ్” - “నవాబీ కుర్బానీ కా మీఠా” వంటి వాటితో పాటు మరెన్నో ఈ సందర్భంగా ఉండనున్నాయి.

వారాంతం సందర్భంగా అక్టోబర్ 23 దేశవ్యాప్తంగా ఉన్న తన రెస్టారెంట్లలో గోదావరి “దివాళీ దమాకా బఫెట్” ను (Diwali Dhamaka Buffet) వినియోగదారులకు అందించనుంది. గోదావరి చరిత్రలో మునుపెన్నడూ లేని మరెన్నడూ అలరించని రీతిలో ఈ బఫెట్ ఉండనుంది.

 గోదావరి చార్లెట్టె ఈ వారాంతంలో తన మొదటి వార్షికోత్సవాన్ని అనందోత్సాహాల మధ్య జరుపుకోనుంది. “బంతి భోజనం” పేరుతో దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్వహించిన ప్రత్యేకమైన లంచ్‌ను ఈ సందర్భంగా వినియోగదారులకు అందించనుంది.

“గత నెలలో మేం ప్రారంభించిన గోదావరి అట్లాంటాకు విశేష స్పందన వచ్చింది. మేం ప్రతి నెల నూతన ప్రణాళికలు ప్రారంభోత్సవాలతో మరింతగా విస్తరిస్తున్నాం. ప్రతి ఒక్క అనుభూతిని పంచుకోవడం - చక్కటి సఖ్యత కలిగిన బృందంగా గోదావరి ముందుకు సాగడం వల్ల ఈ ఫలితం సాధ్యమవుతోంది. ప్రతి ఒక్క కేంద్రంలోని బృందం మరో కేంద్రంతో అనుసంధానం అయి చర్చించుకోవడం వల్ల గోదావరి విశిష్టత మరింత బలోపేతం అవుతోంది. మాకు మరెన్నో ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. మరిన్ని బ్రాండ్లపై మేం కసరత్తు చేస్తున్నాం. “స్పైసీ సలా” పేరుతో సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రక్ ప్రవేశపెట్టినట్లే.... త్వరలో మేం మరిన్ని వినూత్నమైన అంశాలను త్వరలో ప్రవేశపెట్టనున్నాం.” అని కౌశిక్ కోగంటి ఈ సందర్భంగా వివరించారు.

“విశ్వవ్యాప్తంగా దక్షిణాది రుచుల సువాసనలు వెదజల్లేలా చేయాలనే బృహత్తర లక్ష్యంతో మేం ముందుకు సాగుతున్నాం. త్వరలోనే మేం సెంట్రలైడ్జ్ హెల్ప్ లైన్ ను ప్రారంభించనున్నాం. ఒకవేళ - తమకు ఏదైనా చేదు అనుభవం ఏ కేంద్రంలో అయినా ఎదురయినట్లయితే ఈ కేంద్రానికి వినియోగదారులకు కాల్ చేసి దాన్ని పంచుకోవచ్చు. వెంటనే మేం సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతాం” అని వరుణ్ మేడిశెట్టి వివరించారు.

రండి... మీ వారాంతాన్ని నోరూరించే వంటకాలతో ఆస్వాదించండి....

కేంద్రం (Location):

గోదావరి బ్రెంట్ఉడ్
5012 - థరోబెడ్ లేన్
బ్రెంట్ ఉడ్ - టెన్నెస్సీ 37027.

సంప్రదించండిః

వరుణ్ మేడిశెట్టి
630-340-9760
BRENTWOOD@GODAVARIUS.COM

మరోమారు కృతజ్ఞతలు... మా ఆత్మీయ రుచులను మీరంతా ఆస్వాదిస్తున్నారని భావిస్తూ....

www.GodavariUS.com
 

Press note released by: Indian Clicks LLC