Begin typing your search above and press return to search.

రీఛార్జ్ కోసం సాహసాలు చేయమంటున్న కేంద్రం

By:  Tupaki Desk   |   5 Oct 2015 6:03 AM GMT
రీఛార్జ్ కోసం సాహసాలు చేయమంటున్న కేంద్రం
X
ప్రాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపించే పోకడను కేంద్రం తాజాగా ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా బావిగా బతికేసే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని.. వారిని మరింత ధృడంగా తయారు చేయటంతో పాటు.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన ఉద్యోగుల్ని తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది.

వృత్తిజీవితంలో ఉండే ఒత్తిడిని జయించి.. సవాళ్లు ఎదుర్కొనేలా చేయటంతో పాటు.. రీఛార్జ్ చేసేందుకు వీలుగా కేంద్ర ఉద్యోగుల్ని సమాయుత్తం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెలవులు.. రూ.20వేల క్యాష్ ఇస్తామని ఊరిస్తోంది. అడవుల్లోకి కానీ.. సాహస యాత్రలు కానీ.. ట్రెక్కింగ్.. ఎడారి యాత్ర ఇలా ఏ జర్నీ అయినా ఫర్లేదు.. మీ ఇష్టం. మీరు మరింత సాహసంగా ఉండటమే మా లక్ష్యం అన్నట్లుగా కేంద్రం వైఖరిగా కనిపిస్తోంది.

ఇప్పటివరకూ కేంద్ర ఉద్యోగులు ఒత్తిడిని జయించేందుకు యోగా తరగతుల్ని నిర్వహిస్తున్నకేంద్రం.. తాజాగా ఈ సాహస యాత్రలు చేయాలంటూ ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకోవటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. కేంద్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మరి ఈ విధానాన్ని ప్రైవేటు సంస్థలు స్ఫూర్తిగా తీసుకుంటాయో.. లేదో..?