Begin typing your search above and press return to search.

2019లో ఆ రెండూ జ‌రుగుతాయి- చిరంజీవి

By:  Tupaki Desk   |   21 April 2018 10:23 AM GMT
2019లో ఆ రెండూ జ‌రుగుతాయి- చిరంజీవి
X
అవునా? ప‌వ‌న్ గురించి ఏమ‌న్నాడు? మీడియా గురించి ఏమైనా కామెంట్లు చేశాడా? చెప్పండి బాస్ ఏం అన్నాడు... అని ట‌ప‌ట‌పా మీ మైండ్లో నాలుగైదు ప్ర‌శ్న‌లు ఈ హెడ్డింగ్ చూసిన వెంట‌నే మెద‌లి ఉంటాయి. కానీ మీవి శేష ప్ర‌శ్న‌లే. ఎందుకంటే చిరంజీవి ఆ ఇష్యూల‌పై నోరు విప్ప‌లేదు. ఆయ‌న కాంగ్రెస్ నేత‌గా ప్ర‌త్యేక హోదా గురించి స్పందించారు.

దేశం సంక్షోభంలో ఉంద‌ని, ప్ర‌జా వ్య‌తిరేక‌ విధానాలు న‌డుస్తున్నాయంటూ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుంది. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తుంద‌ని ఆయ‌న అన్నారు. బీజేపీ వ‌ల్ల ఎన్న‌టికీ అది జ‌ర‌గ‌దు అని ఏపీకి హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే చిరంజీవి స్ప‌ష్టం చేశారు. ఇంత‌కీ ఎపుడు ఎక్క‌డ మాట్లాడారు అంటే... అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కొన్ని నియామ‌కాలు చేప‌ట్టింది. అందులో కార్యదర్శిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు ఈరోజు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని హైదరాబాద్ లోని ఆయ‌న‌ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా - ఒడిశా ఇంఛార్జిగా నియమితుడైన గిడుగు రుద్రరాజును చిరంజీవి అభినందించారు. ప‌నిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ ఎన్న‌టికీ మ‌రువ‌ద‌ని - పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు.

అయితే, చిరంజీవి ఒక రాజ‌కీయ నేత‌. సినిమా స్టార్‌. ఆ రెండు పాత్ర‌ల‌ను ఇప్ప‌టికీ పోషిస్తున్నారు. కానీ ఇంత అల‌జ‌డి జ‌రుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. త‌ల్లిని తిట్టార‌ని ప‌వ‌న్ తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. నాగ‌బాబు కూడా దీనిపై ఆవేశంగా స్పందించారు. కానీ చిరంజీవి మాత్రం కామ్ గా ఉన్నారు.