Begin typing your search above and press return to search.

హ్యాక్ చేసి మరీ రాక్షసులకు వార్నింగ్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   29 Nov 2015 3:48 AM GMT
హ్యాక్ చేసి మరీ రాక్షసులకు వార్నింగ్ ఇచ్చారు
X
తమ హింసాత్మక వైఖరితో ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇచ్చే ఐఎస్ తీవ్రవాదులకు ఊహించని షాక్ ఒకటి ఎదురైంది. తమ అకృత్యాల గురించి గొప్పగా ప్రచారం చేసుకునే వారి వెబ్ సైట్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. భయాన్ని రేకెత్తించే వీడియోలు పోస్ట్ చేస్తూ.. తమ హింస గురించి ప్రపంచానికి పరిచయం చేసుకునే వారి వెబ్ సైట్ పని చేయకుండా.. వయాగ్రా యాడ్ ను పోస్ట్ చేసి షాకిచ్చారు కొందరు హ్యాకర్లు.

‘‘గోస్ట్ సెక్’’ అనే హ్యాకింగ్ గ్రూప్ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో ఐఎస్ తీవ్రవాదులకు భారీ వార్నింగ్ ఇచ్చింది. ప్యారిస్ లో రక్తపాతం సృష్టించి అమాయకుల ప్రాణాలు తీసిన ఐఎస్ ను సైబర్ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా.. వెతికి పట్టుకొంటామని చెప్పటమే కాదు.. తమ నుంచి తప్పించుకోలేరంటూ సవాలు విసిరింది.

‘‘మీ ఆనవాళ్లు దొరక్కుండా త్వరలోనే పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తాం’’ అంటూ హ్యాకర్ల అధికార ప్రతినిధి ఒకరు ఐఎస్ రాక్షసులకు వారి వెబ్ సైట్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు. ఈ హ్యాకర్ల గ్రూపు పుణ్యమా అని ఐఎస్ వెబ్ సైట్ ను మూసేశారు. సైబర్ ప్రపంచంలో ఐఎస్ కు చుక్కలు చూపుతున్న ఈ హ్యాకర్ల మాదిరి.. విడిగా వారికి ‘సినిమా’ చూపించేవారెవరు..?