Begin typing your search above and press return to search.

ఇలాంటి నిరసన అన్ని చోట్ల చేస్తే ఎంత బాగుండు?

By:  Tupaki Desk   |   5 May 2016 4:27 PM GMT
ఇలాంటి నిరసన అన్ని చోట్ల చేస్తే ఎంత బాగుండు?
X
నిరసన పేరుతో వినూత్నంగా వ్యవహరించటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. అలాంటి నిరసనే తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఎస్ ఎస్ యూఐ సంస్థ బెంగళూరులోని మౌర్య హోటల్ సర్కిల్ వినూత్నంగా నిరసనను నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధర భారీగా పడిపోయినా.. దేశంలో మాత్రం అదే రీతిలో తగ్గకపోవటంపై నిరసన వ్యక్తం చేసిన వారు.. పెట్రోల్ ను కారుచౌకగా అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు.

ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథ్ ఈ నిరసనలో పాల్గొంటూ.. లీటరు పెట్రోల్ ను రూ.30 చొప్పున అమ్మారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినా.. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే సర్కారు అందుకు భిన్నంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తాజాగా చేపట్టిన నిరసన ప్రదర్శన అన్ని ఊళ్లలో నిర్వహిస్తే ఎంత బాగుండు అనిపించక మానదు. ఎంత నిరసన అయితే మాత్రం లీటరు పెట్రోల్ ను రూ.30కు అమ్మటమేమిటి..?