Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు జీఈ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:42 AM GMT
తెలంగాణ‌కు జీఈ వ‌చ్చేసింది
X
ఇటీవ‌ల కాలంలో పేరున్న కొన్ని కంపెనీలు ఏపీకి వెళుతున్న వైనం మీడియాలో చూస్తున్న‌దే. ఇలా ప్ర‌ముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి ప్ర‌ద‌ర్శిస్తున్న ఆస‌క్తి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింద‌న్న మాట వినిపిస్తోంది. పెట్టుబ‌డిదారుల‌కు సర‌ళంగా ఉండ‌టంతో పాటు.. వారికి వీలైన‌న్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం ముందు ఉంద‌ని ఎంత చెప్పినా.. ప్ర‌ముఖ కంపెనీలు తెలంగాణకు రావ‌టం లేద‌న్న అసంతృప్తిని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ముఖ కంపెనీల్ని రాష్ట్రానికి తీసుకురావ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ పోటీలో ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వెనుక‌బ‌డి ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అలాంటిదేమీ లేద‌న్నట్లుగా తాజాగా ఒక ప్ర‌ముఖ కంపెనీ హైద‌రాబాద్‌ లో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి రావ‌టం టీఆర్ ఎస్ స‌ర్కారుకు కొత్త శ‌క్తిని ఇవ్వ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి.

ఎరోస్పేస్ హ‌బ్ గా దూసుకెళుతున్న హైద‌రాబాద్ లో ప్ర‌ఖ్యాత జీఈ (జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రానిక్స్‌).. టాటా గ్రూప్ భాగ‌స్వామ్యంలో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫ్లాంట్ ఏర్పాటు చేయ‌నున్నారు. జెట్ విమానాల ఇంజ‌న్ విడిభాగాల్ని.. ఇత‌ర ఉత్ప‌త్తుల్ని ఈ ఫ్లాంట్ లో త‌యారు చేస్తారు.

దాదాపు రూ.3వేల కోట్ల భారీ పెట్టుబ‌డితో ఈ కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కానున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ డీల్ కార‌ణంగా రానున్న రోజ‌ల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏరో స్పేస్ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి మ‌రిన్ని కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఈ డీల్ ఓకే కావ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ కార‌ణంగానే ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జీఈ గ్రూపు ఛైర్మ‌న్ జాన్ ఎల్ ఫ్లెన‌రీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా జీఈ అధినేత మ‌న‌సును కేటీఆర్ మాట‌ల‌తో ప్ర‌భావితం చేయ‌టంతోనే ఈ ప్రాజెక్టు హైద‌రాబాద్‌కు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసే జీఈ-టాటా గ్రూపు ఏయిరో స్పేస్ హ‌బ్ లో ఏం చేస్తార‌న్న విష‌యంలోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగుచూస్తాయి. ఫిలాట‌స్ ట్ర‌యినర్లు.. లాక్ హీడ్ మార్టిన్ సి-130 టెయిల్ ను త‌యారు చేస్తారు. విమాన‌ల తయారీ సంస్థ బోయింగ్ ప్ర‌స్తుతం కొరియాలో ఉన్న అపాచీ యుద్ధ హెలికాఫ్ట‌ర్ల ఉత్ప‌త్తిని హైద‌రాబాద్ లోని టాటా కేంద్రానికి మార్చాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జీఈ కూడా టాటా భాగ‌స్వామ్యంలో ఏరోస్పేస్ రంగంలో జాయింట్ వెంచ‌ర్ చేయాల‌ని భావించింది. కొత్త‌గా ఏర్పాటు చేసే ఫ్లాంట్ లో సీఎఫ్ ఎం ఇంట‌ర్నేష‌న‌ల్‌ కు చెందిన లీఫ్ ఇంజ‌న్ విడిభాగాల్ని త‌యారు చేస్తారు. సీఎఫ్ ఎంను జీఈ.. శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజ‌న్లు స‌మ భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేశాయి. విమానాల త‌యారీలో లీఫ్ ఇంజ‌న్ల‌కు మంచి పేరుంది.

సాంకేతిక‌త‌.. ఇంధ‌న సామ‌ర్థ్యం దృష్ట్యా సింగిల్ ఐట్ క‌మ‌ర్షియ‌ల్ జెట్స్ కోసం లీఫ్ ఇంజ‌న్ల‌ను వాడేందుకు ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటారు. దేశీయంగా మిల‌ట‌రీ విమానాల ఇంజ‌న్లు.. విమాన వ్య‌వ‌స్థ‌ల త‌యారీకి ఉన్న అవ‌కాశాల్ని కూడా ఈ జాయింట్ వెంచ్ ద్వారా అందిపుచ్చుకోవాల‌ని టాటా.. జీఈలు భావిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్‌ కు ఉన్న ఇమేజ్‌కు భిన్న‌మైన ఇమేజ్ ఎయిరో స్పేస్ హ‌బ్ తీసుకొస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.