Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం అభ్యర్థి చిరు.. బీజేపీ మెగా ఆఫర్.!?

By:  Tupaki Desk   |   25 Aug 2019 7:16 AM GMT
ఏపీ సీఎం అభ్యర్థి చిరు.. బీజేపీ మెగా ఆఫర్.!?
X
ఒకరేమో అసంతృప్తితో రగిలిపోయి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన నేత. మరొకరు ఏమో కమలదళం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాజీ నేత.. మెగా హీరో.. ఇద్దరూ కలిశారు.. ఇంకేముందీ కమలం పార్టీలోకి జంప్ అవుదానే చర్చించారని వార్తలు గుప్పుమంటున్నాయి.అనుంగ మిత్రులైన వీరిద్దరి కలయిక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఏపీలో బీజేపీకి కొత్త స్టార్ క్యాంపెయినర్ రాబోతున్నారనే చర్చకు దారితీస్తోంది.

తెలుగు దేశం పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి టీడీపీకి - చంద్రబాబు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు మాజీ మంత్రి - టీడీపీ సీనియర్ ఉత్తరాంధ్ర నేత గంటా శ్రీనివాసరావు. ఈయన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి జంప్ చేయబోతున్నారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక కేంద్రంలోని ఓ జాతీయ పార్టీ తనను పార్టీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తోందని సైరా ప్రమోషన్ లో పాల్గొన్న చిరంజీవి హాట్ కామెంట్ చేశారు. ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అయ్యి కాంగ్రెస్ లో కేంద్రమంత్రిగా చేసి రాజకీయాలకు దూరమైన చిరంజీవి.. ఇప్పట్లో రాజకీయాల బాటపట్టను. రాను అని సినిమాలే చేసుకుంటానని స్పష్టం చేస్తున్నారు. రాజకీయాలకు రాంరాం అంటున్నారు..

అయితే తాజాగా చిరంజీవితో గంటా శ్రీనివాస్ రావు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ దూతగానే గంటా చిరును కలిశారన్నది పొలిటికల్ సర్కిల్స్ మాట.. బీజేపీలో చేరితే ఏపీ బీజేపీని లీడ్ చేసే అవకాశం చిరుకు ఇస్తారని.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆఫర్ ను బీజేపీ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. చిరుకు సన్నిహితుడైన గంటా ద్వారానే ఈ చర్చలు సాగించినట్టు ప్రచారం సాగుతోంది. మరి ఈ రాజకీయ కీలక భేటి వెనుక నిజనిజాలు ఏమిటన్నది వాళ్లు నోరువిప్పితే తెలిసే అవకాశం లేదు.