Begin typing your search above and press return to search.

గంగ నీటి పవిత్రతకు శాస్త్రీయ రుజువు!

By:  Tupaki Desk   |   28 Sep 2016 10:30 PM GMT
గంగ నీటి పవిత్రతకు శాస్త్రీయ రుజువు!
X
గంగా నది పవిత్రమైందని - స్వచ్చమైనందని ఎందుకు చెబుతారు? హిందువులు తాము చనిపోయాక అస్థికలను గంగలో కలపాలని ఎందుకు కోరుకుంటారు? గంగా నదిలోని నీటికి - మిగిలిన నీటికీ తేడా ఉందా? ఉంటే ఏమిటి ప్రత్యేకత? ఎక్కడ ప్రవహించినా అదే నీరు కదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సామాధానాలు చెబుతున్నారు మైక్రోబయాలజిస్టులు. అవును... గంగానది నీరు ఎందుకు పవిత్రమైందో.. గంగా జలానికీ మిగిలిన నీటికి ఉన్న తేడా ఏమిటో శాస్త్రీయంగా చెబుతున్నారు "ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీ (ఇంటెక్‌)" మైక్రోబయాలజిస్టులు.

గంగా నది పవిత్రత గురించి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోనూ ఉంటుంది. ఈ క్రమంలో నిజంగా గంగా నదికి అంత పవిత్రత ఉందా? గంగ నీటిని డబ్బాల్లో పట్టి తెచ్చుకుంటే.. ఏళ్లు గడిచినా ఎందుకు పాడవవు? తాజాగా వీటికి సమాధానాలను తెలిశాయి. గంగా ప్రక్షాళన శాఖ ఆదేశాల మేరకు అధ్యయనాన్ని నిర్వహించిన అనంతరం ఈ నీటిలో రకరకాల బాక్టీరియాలను నిర్మూలించే బ్యాక్ట్రయోఫేజ్ రకానికి చెందిన పలు వైరస్ లు ఉన్నట్లు తెలిసింది. ఈ వైరస్ లు హానికరమైన బాక్టీరియాలను నాశనం చేయడం వల్ల గంగనీళ్లు మురిగిపోకుండా స్వచ్చంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

గంగా నదిలో ఉన్నట్లు కనుగొన్న ఈ వైరస్ ను అత్యంత శక్తివంతమైన క్షయ - టైఫాయిడ్ - న్యుమోనియా - డయేరియా మొదలైన వ్యాదులకు విరుగుడుగా కూడా ఉపయోగించొచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కాగా, గంగలో ఇలాంటి వైరస్ ను శాస్త్రజ్ఞులు గుర్తించడం ఇదే మొదటిసారి. అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులకూ లొంగని ఇంఫెక్షన్లపై పోరాటానికి వీటిని ఉపయోగించొచ్చని సి.ఎస్.ఐ.ఆర్ -ఇన్‌ స్టిట్యూట్‌ సీనియర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ షణ్ముగం మయిల్‌ రాజ్‌ అభిప్రాయపడుతున్నారు.