Begin typing your search above and press return to search.

ఆ యూనివర్సిటీ లోగోలో వినాయకుడు

By:  Tupaki Desk   |   6 Oct 2015 11:19 AM GMT
ఆ యూనివర్సిటీ లోగోలో వినాయకుడు
X
ఇటీవలే వినాయకచవితి పండుగను భారతదేశమంతా బ్రహ్మాండంగా జరుపుకొంది.... నిమజ్జనం కూడా పూర్తయింది... తెలుగు రాష్ట్రాల్లో అయితే.. భారీ విగ్రహాలు... టన్నుల కొద్దీ బరువున్న లడ్డూ ప్రసాదాలు... వాటికి వేలాలు... లక్షల్లో కొనడాలు... ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా అంతటా వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నాలు తొలగించే దేవుడని ప్రతీతి.

వినాయక చవితి - నిమజ్జనం తరువాత కూడా వినాయకుడు వార్తల్లో నానుతున్నాడు. తాజాగా ముంబయిలో ఓ వినాయకుడి గుడిలో ముస్లిం మహిళలకు స్థానిక హిందూ మహిళలు కాన్పు చేశారు.. నడిరోడ్డుపై నొప్పులు రావడంతో ఇబ్బంది పడుతున్న ఆమెను అక్కడున్న మహిళలు వినాయకుడి గుడిలో చేర్చి కాన్పు చేసిన సంగతి తెలిసిందే.

వినాయకుడికి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ భక్తులున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వినాయకుడి కోవెలలు ఉన్నాయి. బ్రిటన్ - అమెరికా - ఫ్రాన్సు వంటి దేశాల్లో హిందూ దేవుళ్ల చిత్రాలను అవమానిస్తున్న సంఘటనలూ ఉన్నాయి.. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం గొప్పగా పూజిస్తున్నారు. ఇండోనేసియాలో వినాయకుడి బొమ్మను ఓ యూనివర్సిటీ తన లోగోలో ఇముడ్చుకుంది. ఇండోనేషియాలోని ప్రతిష్టాత్మకమైన పురాతన విశ్వవిద్యాలయం బన్ డుంగ్ లోని ఇనిస్టిట్యూట్ టెక్నాలజి తన లోగోలో వినాయకుడు చిత్రాన్ని ఉంచింది. విఘ్నాలు తొలగించే దేవుడు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.